కేంద్ర ఫిలిమ్ సెన్సారు వారు ఈ మధ్యకాలంలో హిందీ - ఇంగ్లీషు - తెలుగు తదితర ప్రాంతీయ భాషలలోని కొన్ని పదాలను నిషేధిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఈ మధ్యకాలంలో కేరళ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో గౌరవనీయులైన మంత్రులు - శాసనసభ్యులు ఉపయోగించిన భాషను అర్ధంజేసుకుని, అధ్యయనంచేసి అటువంటి భాషా ప్రవీణులకు అభినందనలేఖ పంపుతూ తాజాగా వారు ‘అశ్లీలం ధ్వనిస్తోంది’ అంటూ కొన్ని పదాలపై విధించిన నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని మనవి చేస్తున్నాం!
ఇదే సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులకు ఓ విజ్ఞప్తి : ఏ కవీ రాయని, ఏ రచనలోనూ కనిపించని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాత్రమే వినిపించిన ఈ కొత్త కొత్త పదాలను కూడా చేర్చి తెలుగు భాష విస్తృతికి కృషిచేయవలసిందిగా కోరుతున్నాం!!