మావోయిస్టుల సానుభూతిపరుడు - తెలంగాణ విభజనని బాహాటంగా సమర్ధించిన విప్లవభావాల వీచిక - పీపుల్స్ స్టార్ ‘ఆర్.నారాయణమూర్తి’ పవనిజం గీతావిష్కరణ సభలో పవన్ కళ్యాణ్‌ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షని వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్‌కి నక్సల్ భావజాలంపట్ల - చెగువేరా పట్ల - సగటు మనిషి పట్ల సానుకూల దృక్పధముందన్న ప్రచారంవుంది. నారాయణమూర్తిగారూ - ‘నక్సలిజం’ విషయమై పవన్ కళ్యాణ్ స్పష్టమైన వైఖరిని బయటపెట్టేలా చూడండి. ఆరెస్సెస్ భావాల ఒడిలో పెరిగిన నెలబాలుడు మోదీని, అరుణతారలను ఒకే పర్యాయం ఆలింగనం చేసుకోవడం అసంభవం. అలాగే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అన్నారు. ఏ రాష్ట్రానికి? ఆంధ్రాకా - తెలంగాణకా?
- నిజాన్ని నిర్భయంగా చెప్పే మీరు ఈ నిశ్శద్దాన్ని బద్దలు చేయండి!
- తోటకూర రఘు