Advertisementt

లంకలో మోదీ - గుండెగాయానికి లేపనం!

Wed 18th Mar 2015 06:23 AM
srilanka,modi,bharat,devotional,friendship,modi in srilanka  లంకలో మోదీ - గుండెగాయానికి లేపనం!
లంకలో మోదీ - గుండెగాయానికి లేపనం!
Advertisement

లంకలో మోదీ - గుండెగాయానికి లేపనం!

బంగ్లాదేశీయులు మరియు తమిళుల హృదయాలు గెలిచిన భారత్‌!

శ్రీలంకలో భారత్‌ మిలటరీ.

పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఎల్‌టిటిఈ.

లంకలో మానవ హక్కుల ఉల్లంఘన.

చైనాకి చేరువయిన ‘లంక’ రాజపక్సే.

కన్నెర్రజేసిన భారతీయ తమిళులు!

-ఈ నేపధ్యంలో భారత ప్రధాని మోదీ లంకలో పర్యటించారు. గాయపడిన లంక తమిళుల గుండెకు లేపనం పూస్తూ స్వాంతవచనాలు పలకడమేగాదు, ‘మీకు నేనున్నా’ అన్న భరోసా ఇచ్చారు. లంక తమిళుల పునరావాస కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఇళ్ళముందు పాలు పొంగించి గృహ ప్రవేశం చేశారు; పవిత్ర ఆలయాలు దర్శించారు - శివునికి అభిషేకం జరిపించారు. ‘మీలో నేనొకడ్ని; మీకు నేనున్నా’ - అన్న ఆత్మీయ భావన కల్పించారు.

భారత్‌ - శ్రీలంక సంబంధాలను ఒక గాటన పెట్టారు. సముద్రజలాలపై పెత్తనం సాగిస్తున్న చైనాకి చెక్‌ పెట్టడానికి- పొరుగు దేశాలతో స్నేహబంధం దృఢం చేయడానికి మోదీ చేపట్టిన ఈ శ్రీలంక టూర్‌కి విశేష ప్రాధాన్యత వుంది; కోట్లాది ‘లంక - భారత్‌’ ప్రజల మద్దతు వుంది. ఇదే సమయంలో బంగ్లా ప్రధానితో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశానికీ అంతే ప్రాధాన్యత వుంది. ఈ ఇరువురి ప్రయత్నాలు భారత జాతికి శుభ శకునాలే!

భారతదేశానికి పాకిస్ధాన్‌, ఆఫ్ఘనిస్ధాన్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, మయన్మార్‌ మరియు చైనా పొరుగుదేశాలు. వీటన్నిటితో ఆర్ధిక - వాణిజ్య -సాంస్కృతిక స్నేహ వారధి నిర్మించడం చాలా అవసరం. ఈ విషయమై మన నేతలు దృష్టిసారించడం శుభపరిణామం!

- తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement