Advertisementt

కాలచక్ర యాగ ఫలితమే గుంటూరుకి ఈ మహర్దశ!

Wed 18th Mar 2015 06:16 AM
guntur,amaravathi,capital,andhra pradesh  కాలచక్ర యాగ ఫలితమే గుంటూరుకి ఈ మహర్దశ!
కాలచక్ర యాగ ఫలితమే గుంటూరుకి ఈ మహర్దశ!
Advertisement
Ads by CJ

అమరావతి బౌద్ధ క్షేత్రం, శివ క్షేత్రం, బాలా త్రిపుర సుందరి ఆవాసం, పావన కృష్ణాతీరం!

‘అమరావతి’ అంటే బౌద్ధుల పాలీ భాషలో మరణంలేనిది - అమరం!

ప్రపంచ బౌద్ధులందరూ ఇక్కడే సమావేశమయ్యారు; బౌద్ధుల ఆధ్యాతిక గురువు దలైలామా ఆధ్వర్యంలో కాలచక్ర పూజ చేశారు. గౌతముడు తొలిసారిగా శిష్యులకు కాలచక్రాన్ని ఆవిష్కరించింది అమరావతిలోనేనని చరిత్రకారుల ఉవాచ.

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు - నాగార్జున విశ్వవిద్యాలయం వగైరా వగైరా బౌద్ధమత వీచికలు మనమధ్యేవున్నాయి. కృష్ణాజిల్లా ఘంటసాల, మొవ్వ తదిదతర గ్రామాలలో నేటికీ నేలలో బౌద్ధమత శిలావశేషాలు బయటపడుతున్నాయి.

చైనా, జపాన్‌, టిబెట్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ తదితర 71 దేశాలలో బుద్ధిజం పరిఢవిల్లుతోంది. 2006 - జనవరి  12 నుంచి 15 వరకు అమరావతిలో జరిగిన ఈ కాలచక్రకు దాదాపుగా లక్షమంది హాజరయ్యారు; వీరిలో 4,000 మంది చైనీయులు; 15,000 మంది టిబెటన్లు వున్నారు. ఆ వారం రోజులు అమరావతి కాషాయవర్ణంతో భాసిల్లింది. వేలాదిమంది రోజుల తరబడి చేసిన పవిత్రపూజలు; సత్సంగం విశ్వగురుల ఆశీర్వచనాలు ` వెరసి ఈ కర్మభూమి మరోమారు పునీతమయింది. ఈ తపోభూమికి రాష్ట్ర రాజధానిగా మహర్దశ అందుకుంది. నూతన రాజధాని నిర్మాణంలో బౌద్ధానికి ప్రాధాన్యత వుండాలి. బౌద్ధం స్ఫురించే పేరు రాజధానికి పెట్టాలి. ప్రపంచ బౌద్ధ దేశాలను ` బౌద్ధ కేంద్రాలను ఆకట్టుకోవాలి; బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా, టూరిస్టు స్పాట్‌గా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వెలగాలి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రపంచ బౌద్ధుల కేంద్రం కావాలి.

ఓల్డు హౌదరాబాదు నిర్మాణంలో పాశ్చాత్యముస్లిం ఇంజనీరింగ్‌ - టెక్నాలజీ కనిపించినట్లే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంలో బుద్ధిజం ఛాయలు కనిపించేలా చంద్రబాబు జాగ్రత్తపడాలి.

- తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ