Advertisement

డీలాపడ్డ సీమాంధ్ర పారిశ్రామిక దిగ్గజాలు !

Tue 17th Mar 2015 06:34 AM
japan,singapore,amar raja batteries,seemandhra,andhra pradesh,chandra babu  డీలాపడ్డ సీమాంధ్ర పారిశ్రామిక దిగ్గజాలు !
డీలాపడ్డ సీమాంధ్ర పారిశ్రామిక దిగ్గజాలు !
Advertisement

జపనీస్‌ వారికి ‘విజయా ఎలక్ట్రికల్స్‌’ టెక్నాలజీ కావాలి,

సింగపూర్‌ వాసులకి ‘అమర్‌ రాజా బ్యాటరీస్‌’ కావాలి,

ఎడారి దేశాలలో వంతెనలు, రోడ్లు, బహుళ అంతస్థుల భవనాలు, విమానాశ్రయాల నిర్మాణానికి మన తెలుగువారి సంస్థలే కావాలి!

- అంతర్జాతీయంగా ఈ కంపెనీలు విజయవంతంగా పూర్తిచేసిన ప్రాజెక్టులపరంగా క్రెడిట్‌ రేటింగ్‌- వరల్డు బ్యాంకు లోన్‌ ఫెసిలిటీస్‌ వుంటాయి- బ్రాండ్‌ ఇమేజ్‌ వుంటుంది.

ఆంధ్ర రాష్ట్ర విభజన : ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం, నూతన రాజధాని, పారిశ్రామిక కారిడార్‌, ఔటర్‌ - ఇన్నర్‌ రింగురోడ్లు, బుల్లెట్‌ ట్రెయిన్లు వగైరా వగైరా ... తమ సామర్ధాన్ని నిరూపించుకోవడానికి, తమ టర్నోవర్‌ పెంచుకోవడానికి, తమ క్రెడిట్‌ రేటింగ్‌ గ్రోత్‌ చూపెట్టడానికి, వరల్డు బ్యాంకులోన్స్‌ సంపాదించడానికి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బిజినెస్‌ ప్లేయర్స్‌కి ఓ సవాలు విసరడానికి ఒక వేదిక - ఒక అవకాశం దొరికిందని ఆంధ్రా ప్లేయర్స్‌ సంబరపడ్డారు, స్వరాష్ట్రానికి సేవచేశాం - స్వరాష్ట్రాన్ని పునర్నిర్మించాం అన్న ‘తృప్తి’ కోసం తహతహలాడారు.

‘విజనరీ లెజండ్‌’ అనదగిన వ్యక్తే ముఖ్యమంత్రిగా రావాలని ఆశించాయి, ప్రచారం చేశాయి, ఓటర్లలో ఓ ఫీల్‌ తీసుకొచ్చాయి. పరోక్షంగా చంద్రబాబుని ఈ బిజినెస్‌ ట్రైకూన్స్‌ ప్రమోట్‌ చేశారు. వారు ఆశించినట్టే చంద్రబాబు అధికారానికి వచ్చారు. కానీ వారికి షాక్‌ ఇస్తూ, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మార్కెట్‌లో మన తెలుగు దిగ్గజాలకు ప్రత్యర్ధులయిన ఫారిన్‌ కంపెనీలు ప్లేయర్స్‌గా కనిపించారు. అంతే!! మన దిగ్గజాల గుండెలు జల్లుమన్నాయి. రచ్చగెలిచిన తెలుగు దిగ్గజాలు ఇంట దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏమయింది మనవారి క్రెడిబిలిటీ -క్రెడిట్‌రేటింగ్‌?

హతోస్మి!!

- తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement