Advertisementt

13 శుక్రవారం - ఎవడిసెంటిమెంట్‌ వారిది!

Sat 14th Mar 2015 07:46 AM
13th friday,good friday,kcr,chandrababu,astrology,sentiments  13 శుక్రవారం - ఎవడిసెంటిమెంట్‌ వారిది!
13 శుక్రవారం - ఎవడిసెంటిమెంట్‌ వారిది!
Advertisement

ఆంధ్రులకి ‘అమావాస్య’ పట్టింపు, శుభకార్యాలు తలపెట్టరు.

తమిళులకి ‘అమావాస్య’ పర్వదినం, శుభకార్యాలకు ముహూర్త సమయం!

అలాగే, ‘శుక్రవారం -13వ తేదీ’ వారం తేదీ రెండూ కలిసొచ్చే రోజంటే యూరప్‌ భయాందోళనలతో బిగుసుకుపోతుంది. ఈ రోజున స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిపోతాయి - విమానాలలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది- జనం ప్రమాదాన్ని శంకించి రోడ్లమీదకు రారు : ఒక్క వాక్యంలో చెప్పాలంటే మంచం దిగడానికి కూడా భయపడతారు. కానీ ఒకే ఒక దేశం - ‘13 శుక్రవారం’ శుభ శకునంగా భావిస్తుంది. అదే, మన సోనియా జన్మస్థలం ఇటలీ.

‘బ్లాక్‌ ఫ్రైడే’గా చెప్పబడే ‘13, శుక్రవారం’ నాడు 17-21 మిలియన్ల అమెరికన్లు ఏదో జరిగిపోతుందన్న భయభ్రాంతులతో, మానసిక రోగంతో హాస్పిటల్‌ పాలవుతారట. అమెరికాలోనేకాదు ‘స్పానిష్‌, గ్రీక్‌’ భాషా ప్రాంతాలను కూడా ఈ బ్లాక్‌ డే భయపెట్టేస్తుంది. ఈ బ్లాక్‌ ఫ్రైడే నేపధ్యంగా పలు రచనలు, సినిమాలు వెలువడ్డాయి.

బైబిల్‌కి సంబంధించి - క్రీస్తు ప్రభువుని శిలువ వేసిన రోజు - గుడ్‌ ఫ్రైడే : లాస్ట్‌ సప్పర్‌ : 13 మంది శిష్యులను సింబాలిక్‌గా చెబుతారు గాని 20వ శతాబ్దంలోనే ఈ బ్లాక్‌ ఫ్రైడే ఫోబియా విజృంభించింది.

1972 అక్టోబరు 13 - శుక్రవారం : ఓల్డ్‌ క్రిస్టియన్‌ రగ్బీ క్రీడాకారులు - వారి కుటుంబ సభ్యులు, పాసెంజర్స్‌తో వెళ్తున్న ‘ఉరుగ్వే’ విమానం ఉరుగ్వే, చిలీ ప్రయాణంలో దారి తప్పి ప్రమాదానికి గురవడం ఈ మూఢ నమ్మకాన్ని బలపర్చింది. చిత్రమేమంటే ఈ ప్రమాదంలో చిక్కుకున్న 45 మందిలో 16 మంది - 72 రోజుల దుర్భర పరిస్థితిని తట్టుకుని, ఏ అదృశ్య శక్తో ఆదుకున్నట్టు సజీవులుగా ప్రపంచం ముందుకు రావడం, వారి పునర్జన్మ వృత్తాంతాలు కథలు కథలుగా వెలువడటం కొసమెరుపు.

తిధి వార వర్జ్యాలే కాదు డోరు నెంబర్లు, వీధి నెంబర్లు కొందర్ని ప్రభావితం చేస్తే వాస్తు మరికొందర్ని ప్రభావితం చేస్తుంది.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించబడ్డ ‘క్యాంపు కార్యాలయం’, సెక్రటేరియేట్‌ వాస్తు బాగుండలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సెక్రటేరియేట్‌ని మార్చడం, వాస్తు బాగుందని ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్ళూరుని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించడం చర్చనీయాంశం అయింది గాని ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా ఈ మూఢనమ్మకాలున్నాయి.

అంతే!! నమ్మకాన్ని మించిన అమ్మకం లేదు.

-తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement