Advertisementt

మన్మోహన్‌ సరే, జగన్‌ మాటేమిటి సోనియా గారూ!

Sat 14th Mar 2015 05:40 AM
ys jagan,sonia gandhi,manmohan singh,prime minister  మన్మోహన్‌ సరే, జగన్‌ మాటేమిటి సోనియా గారూ!
మన్మోహన్‌ సరే, జగన్‌ మాటేమిటి సోనియా గారూ!
Advertisement
Ads by CJ

బొగ్గుస్కాం - మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నిందితుడే,  అపరాధిగా నిర్ణయింపబడలేదు. సిబిఐ స్పెషల్‌ కోర్టు సమన్లు మాత్రమే పంపింది. ఇంతమాత్రానికే సోనియా ఎందుకంత రాద్ధాంతం చేయాలి? భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం ముందు అందరూ సమానులేనని భారత మాజీ ప్రధాని - జాతీయ కాంగ్రెసు అధ్యక్షురాలు అంగీకరించి మన రాజ్యాంగస్ఫూర్తిని గౌరవించవచ్చుగదా! ఉన్నతస్థాయి వ్యక్తులకు ఒక న్యాయం - సామాన్యునికి మరో న్యాయమా?

జగన్‌ ఆదాయాన్ని మించిన ఆస్తులు :

ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహనరెడ్డి - కాంగ్రెసు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగా తండ్రి పరపతిని  అడ్డంపెట్టుకుని అక్రమార్జన చేశారన్న ఆరోపణపై నిర్బంధించడం, ఆస్తులు సీజ్‌ చేయడం జరుగుతోంది. సిబిఐ ఆరోపించినట్లు జగన్‌ అక్రమాస్తులను కూడబెట్టారనే అనుకుందాం. అందుకు అవకాశం ఇచ్చిన - రాష్ట్ర కాంగ్రెసు ప్రభుత్వం - అంటే కేబినెట్‌ మంత్రులు, అధికారులు దోషులా? కాదా?

బొగ్గు స్కాంలో మాజీ ప్రధాని నిందితుడుకానప్పుడు వైయస్సార్‌ కేబినెట్‌ మంత్రులు - అధికారులు నిరపరాధులే!

విధి నిర్వహణలో అలక్ష్యం / పక్షపాతం ప్రదర్శించిన వారు నిందితునికన్నా పెద్ద నేరగాడు. అతడు భారత రాజ్యాంగాన్ని ` ప్రమాణాన్ని ఉల్లంఘించాడు, నేరం చేయడానికి ఆస్కారం కల్పించాడు.

జగన్‌ నేరగాడయితే, అతడు నేరం చేయడానికి అవకాశం కల్పించిన కాంగ్రెసు ప్రభుత్వం తొలి ముద్దాయి. ఇందులో ఆ పార్టీ అధ్యక్షురాలికి నైతిక బాధ్యత వుంది. అలాగే కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో జరిగిన ‘బొగ్గు స్కాం’కి పార్టీ అధ్యక్షురాలిగా సోనియా, ప్రధానిగా మన్‌మోహన్‌ నైతిక బాధ్యతలనుంచి తప్పించుకోలేరు. తన బాధ్యతలనుంచి తప్పించుకోవడానికి సోనియా ప్రదర్శన నిర్వహించారన్న భావన ప్రజలలోకి వెళ్ళడం ఆ పార్టీకి క్షేమం కాదు.

- తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ