Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: మల్కాపురం శివకుమార్

Fri 13th Mar 2015 07:24 AM
malkapuram sivakumar,surya vs surya,suraksha entertainments  సినీజోష్ ఇంటర్వ్యూ: మల్కాపురం శివకుమార్
సినీజోష్ ఇంటర్వ్యూ: మల్కాపురం శివకుమార్
Advertisement
Ads by CJ

'ఆకాసంలో సగం' , 'భద్రాద్రి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిర్మాత మల్కాపురం శివకుమార్. రీసెంట్ గా నిఖిల్ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'సూర్య వర్సెస్ సూర్య' అనే ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం విడుదలయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా నిర్మాత శివకుమార్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సురక్ష ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ వచ్చిన మొదటి సినిమా ఎలా అనిపించింది? 

సురక్ష ఎంటర్ టైన్మెంట్స్ పేరిట ఎడ్యుకేషనల్ సంస్థలు, హాస్పిటాలిటి వంటివి రన్ చేస్తున్నాం. మొదటిసారిగా ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమాకే ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. 

ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది?

'కార్తికేయ' సినిమా ప్రొడక్షన్ సమయంలో చందు మొండేటి, వెంకట్ శ్రీనివాస్ ల పరిచయం ఈ సినిమాను నిర్మించడానికి దారి తీసింది.  అంతేకాకుండా నా రెండు సినిమాల తరువాత నిర్మించే చిత్రం కొత్తగా యువతను ఆకట్టుకునే విధంగా ఉండాలని అనుకున్నాను. కార్తిక్ ఈ సినిమా స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు ఎంటర్ టైనింగ్ గా, కొత్తగా ఉందా అనే చూసాను. కథ విన్నాక చాలా నచ్చి వెంటనే ఓకే చేసాను.

'సూర్య వర్సెస్ సూర్య' కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది?

ఈ సినిమా రిలీజ్ కు ఒక వారం ముందే పెద్ద పంపిణీదారులు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫాన్సీ రేట్లకు తీసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తిరిగి వచ్చేసాయి. డిస్ట్రి బ్యూటర్లంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా , తమిళనాడు, రాజముండ్రి మొత్తం కలిపి 628 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయింది. సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అయినా ఇంకా 200 థియేటర్లలో మంచి కలెక్షన్లతో ఆడుతోంది.

మెయిన్ ఆర్టిస్టుల పెర్ఫార్మన్సు గురించి?

ఓ సెలబ్రిటీలా కాకుండా తన సొంత సినిమాలా అనుకోని నిఖిల్ చాలా కష్టపడి పని చేసాడు. తనికెళ్ళభరణి  వంటి సీనియర్ ఆర్టిస్ట్ సినిమా షూటింగ్ ఎక్కువశాతం రాత్రి పూట అయినా వచ్చేవారు. హీరోకి తల్లి పాత్రలో మధుబాల అయితేనే సూట్ అవుతుందని ఆవిడ బిజీగా ఒప్పించి తీసుకువచ్చాం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు వారి పరిధిలో బాగా నటించారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ఇప్పటి వరకు కథలేమి వినలేదు. కానీ మా బ్యానర్ లో వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ