రచ్చగెలిచిన తెలుగు పారిశ్రామిక దిగ్గజాల ఇంటి పరిస్థితి?
భారత్ ప్రపంచవ్యాప్తంగా ముందుకు దూసుకుపోతోంది.
ప్రపంచంలోని ఏ పెద్ద పట్టణానికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్‌లో కూర్చున్నా తెలుగు భాష వినిపిస్తుంది.
బిల్‌గేట్స్ - వారెన్ బఫెట్ వారసులు తెలుగువారే!
ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న విమానాశ్రయాల నిర్మాణంలో, సివిల్ కాంట్రాక్టులలో, ప్రముఖ సంస్థల సిఈవోలుగా పోటీపడుతున్నది తెలుగువారే.
-ఈ రోజున తెలుగువారు పొట్టకూటికోసమో / ఉపాధికోసమో విదేశాలకు వెళ్ళటంలేదు. మేధో సంపన్నులుగా, దశాదిశ నిర్దేశకులుగా ఆహ్వానంపై తెలుగువారు విదేశాలకు వెళ్తున్నారు.
కానీ, ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో - రాజధాని నిర్మాణంలో మన దిగ్గజాల పాత్ర ఎంత?
సింగపూర్, జపాన్, అమెరికా, రష్యా తదితర విదేశీయుల ప్రమేయంలేకుండా మన రాజధానిని మనం నిర్మించుకోలేమా?
నాగార్జున సాగర్ ప్రాజెక్టు - కృష్ణా బ్యారేజీ ఇంజనీర్లు సింగపూర్‌నుంచి వచ్చారా? జపాన్ నుంచి వచ్చారా?
హైదరాబాద్‌ని అభివృద్ధి చేసింది నేనే అని చెప్పుకుంటున్న చంద్రబాబుని నిలదీయండి చిరంజీవి గారూ :
- హైటెక్ సిటీ
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు
- ఔటర్ రింగురోడ్డు
నిర్మించింది ఎవరు?
విజయ్ ఎలక్ట్రికల్స్ దాసరి జయ రమేష్ ఎక్కడివాడు?
జిఎం ఆర్ ఎక్కడిది?
గల్ఫ్‌లో సివిల్ వర్క్సు చేస్తున్న కావూరి సాంబశివరావు ఎక్కడివాడు?
అమర్ రాజా బ్యాటరీస్ ఎవరివి?
‘ల్యాంకో’ ఎవరిది? ఎల్ అండ్ టి ఎవరిది?
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిమ్ స్టూడియో ‘రామోజీ ఫిలిమ్ స్టూడియో’ అధినేత ఎక్కడివాడు?
లిపివున్న భారతీయ భాషలన్నింటిలో సినిమాలు నిర్మించిన ‘సురేష్ రామానాయుడు’ ఎక్కడివాడు?
‘జయభేరి’ - తెలుగువాడి విజయభేరి ఎక్కడిది?
- వీరంతా రాష్ట్ర పునర్నిర్మాణంలో, రాజధాని నిర్మాణంలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న మేధావి ఎవరు?
ముస్లిమ్‌లు దండయాత్ర చేశారు, ఫ్రెంచివారు - తెల్లవారు దోచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైట్‌కాలర్డ్ దోపిడీకి తెరలేస్తోంది.
సమైక్యాంధ్ర ఉద్యమం ఓ వైపు ` తెలంగాణ ఉద్యమం మరోవైపు మిన్నంటిన సమయంలో ‘‘హైదరాబాద్‌ని యుటి చేయాలి’’ అని ధైర్యంగా చెప్పిన మీరు ఇప్పుడెందుకు మౌనం వహించారో అర్ధంకావడంలేదు.
ప్రజలు నమ్మే ఏకైక రాష్ట్ర కాంగ్రెసు నాయకుడు మీరే!
ముందుండి నినదించండి : ‘మన రాష్ట్రం, మన రాజధానికి మనమే ఆర్కిటెక్టులం ` కార్మికులం’
చిరంజీవి గారూ... ఇంకెంతకాలం మీ మౌనం!
మీకు ఆలోచన ఎక్కువ ఆవేశం తక్కువ అన్నది జగమెరిగిన సత్యం. ఆలస్యంగా వచ్చినా ప్రజల్ని ఆలోచింపజేసే శక్తి మీకుంది!