Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరో హవీష్‌

Sat 28th Feb 2015 07:44 AM
telugu movie ramleela,hero havish,havish interveiw,heroine nanditha  సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరో హవీష్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరో హవీష్‌
Advertisement
Ads by CJ

హవీష్‌, నందిత జంటగా కోనేరు సత్యనారాయణ సమర్పణలో లంకాల బుచ్చిరెడ్డి సారధ్యంలో రామదూత క్రియేషన్స్‌ పతాకంపై శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రామ్‌లీల’. ఈ చిత్రం ఫిబ్రవరి 27న వరల్డ్‌ వైడ్‌గా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో హీరో హవీష్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

‘రామ్‌లీల’ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

రెస్పాన్స్‌ చాలా బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయి. కానీ, తెలుగులో ఫస్ట్‌ టైమ్‌ ఈ తరహా కథ వచ్చిందని, సినిమా చాలా బాగుందని చూసినవారు అప్రిషియేట్‌ చేస్తున్నారు. 

థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశారా?

చూశాను. ఆడియన్స్‌ నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా స్టార్ట్‌ అయిన పది నిముషాల్లోనే ఆడియన్స్‌ కథలో లీనమైపోతున్నారు. మేం ఏయే సీన్స్‌లో రెస్పాన్స్‌ బాగా వస్తుందని అనుకున్నామో ఆ రెస్పాన్స్‌ కనిపించింది. ముఖ్యంగా పాటలు విజువల్‌గా చాలా గ్రాండ్‌గా వుండడంతో ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తూ చూస్తున్నారు. 

సినిమాకి సంబంధించి ఏయే అంశాలు హైలైట్‌ అయ్యాయి?

ఈ సినిమాకి గోపాలరెడ్డిగారి ఫోటోగ్రఫీ ఫస్ట్‌ హైలైట్‌ అని చెప్పాలి. ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించారు. మమ్మల్ని ఎంతో అందంగా చూపించారు. అది ఆడియన్స్‌ కూడా ఫీల్‌ అవుతున్నారు. ఆ తర్వాత మ్యూజిక్‌ చాలా హైలైట్‌ అయింది. పాటలు సినిమా రిలీజ్‌కి ముందే పెద్ద హిట్‌ అయిన విషయం తెలిసిందే. విజువల్‌గా గోపాలరెడ్డిగారు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ విజువల్‌ బ్యూటీ అనేది ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. 

శ్రీపురం కిరణ్‌ ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్‌ అయ్యారు. ఆయనతో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?

ఫస్ట్‌ సినిమా అయినా చాలా బాగా డైరెక్ట్‌ చేశారు. కథని బాగా హ్యాండిల్‌ చేయడంవల్ల అద్భుతమైన ఔట్‌పుట్‌ వచ్చింది. కొత్త డైరెక్టర్‌ కాబట్టి అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు జరిగి వుండవచ్చు. కానీ, ఓవరాల్‌గా ఒక మంచి సినిమా తీశారన్న పేరు వచ్చింది. కథ బాగాలేదు, సినిమా బాగా లేదు, డైరెక్షన్‌ బాగా లేదు అనే మాట ఎక్కడా వినిపించలేదు. ఆయన అనుకున్నది స్క్రీన్‌ మీద చూపించడంలో సక్సెస్‌ అయ్యారు. 

మీ మొదటి రెండు సినిమాల కంటే ‘రామ్‌లీల’పై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువ వున్నాయి. వాటిని రీచ్‌ అయ్యాం అనుకుంటున్నారా?

ఎక్స్‌పెక్టేషన్స్‌ అనేవి ఏ సినిమా మీదైనా వుంటాయి. సినిమా బాగా రావాలని, వస్తుందనే నమ్మకంతోనే చేస్తాం. ఈ సినిమాకి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ వుండడానికి రీజన్‌ కొంత గ్యాప్‌ తర్వాత చెయ్యడమే. పైగా ఇది ఒక కొత్త కాన్సెప్ట్‌ కావడంతో సినిమా ఎలా వుండబోతుంది అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ వుంటుంది. ఆ విధంగా ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయనుకుంటున్నారు. 

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు. మంచి కథ కోసం చూస్తున్నాను. కథ కుదిరితే డెఫినెట్‌గా సినిమా చేస్తాను. రెగ్యులర్‌గా వుండే కథలు కాకుండా డిఫరెంట్‌గా వుండే కథలు, కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చెయ్యాలన్నది నా కోరిక. లేట్‌ అయినా మంచి సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో హవీష్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ