Advertisementt

చిరంజీవి తీసుకున్న జాగ్రత్త రజనీకాంత్‌ తీసుకోలేదు!

Tue 24th Feb 2015 06:13 AM
chiranjeevi,rajinikanth,distributors,kocchadayan,linga  చిరంజీవి తీసుకున్న జాగ్రత్త రజనీకాంత్‌ తీసుకోలేదు!
చిరంజీవి తీసుకున్న జాగ్రత్త రజనీకాంత్‌ తీసుకోలేదు!
Advertisement
Ads by CJ

‘ఇడియట్‌’ ` రవితేజని హీరోని చేసింది.

‘పోకిరి’ ` మహేష్‌బాబుని సూపర్‌స్టార్‌గా నిలబెట్టింది.

‘మగధీర’ ` రామ్‌ చరణ్‌ని తారా పధానికి తీసికెళ్ళింది.

‘ఖైదీ’ ` చిరంజీవిని మెగాస్టార్‌గా నిలబెట్టింది.

ఇలా ఒక సినిమా హిట్‌ అయితే ముందుగా మార్కెట్‌ వచ్చేది ముగ్గురే ముగ్గురికి: హీరో, హీరోయిన్‌, డైరెక్టరు.

‘అల్లుడు శీను’కి క్రేజ్‌ రావడానికి కారణం: దర్శకుడు వివి వినాయక్‌.

‘ఈగ’ ఓపెనింగ్స్‌కి కారణం దర్శకుడు రాజమౌళి.

సినిమా అమ్మకాలవలన లాభపోయేది / నష్టపోయేది నిర్మాత. కానీ ఈ సినిమా అమ్మకాలు జరిగేది హీరో ` దర్శకులను చూసే! తనని చూసి కోట్లు పెట్టుబడిపెట్టే బయ్యర్‌ / డిస్ట్రిబ్యూటర్‌ / ఎగ్జిబిటర్‌ భవిష్యత్తుకి / రిస్కుకి హీరో - దర్శకుడు నైతిక బాధ్యత తీసుకోవాలి. దాసరి - చిరంజీవి తొలి కాంబినేషన్‌ : వడ్డే వారి ‘లంకేశ్వరుడు’. విపరీతమైన క్రేజ్‌ - రికార్డ్‌ మార్కెటింగ్‌ -  చిరంజీవి ఊహించని రేట్లు!

ఈ సినిమా సరే, చిరంజీవి తదుపరి సినిమా పరిస్థితి ఏమిటి? ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బయ్యర్స్‌ అంచనాలను అందుకోకపోతే చిరంజీవి మీద బ్యాంకు చేసే బయ్యర్స్‌ గల్లంతవుతారు. చిరంజీవి సినిమా కొబ్బరికాయ కొట్టిన రోజునే అడ్వాన్సు ఇచ్చే బయ్యర్స్‌ అడ్రస్‌ వుండదు.

తన మార్కెట్‌ని / తన బయ్యర్స్‌ - డిస్ట్రిబ్యూటర్స్‌ని నిలుపుకోవడానికి చిరంజీవి చొరవ తీసుకొని నిర్మాత వడ్డే రమేష్‌తో సంప్రదించి చిత్ర నిర్మాణ వ్యయాన్ని అంచనావేసి జిల్లావారీ రేట్లు నిర్ణయించారు. నేటికీ చిరంజీవి ఫ్యామ్లీ బయ్యర్స్‌ సేఫ్టీ - ఓపెనింగ్స్‌ - మార్కెట్‌ దృష్టిలో పెట్టుకుంటారు గనుకనే నిర్మాతలు, బయ్యర్స్‌ / డిస్ట్రిబ్యూటర్స్‌ చిరంజీవి ఫ్యామ్లీ హీరోస్‌ కాల్షీట్స్‌కొరకు, జిల్లావారీ హక్కుల కొరకు క్యూలో నిలబడతారు.

‘‘కొచ్చాడియాన్‌’’ అనుభవంతో రజనీకాంత్‌ ఈ ముందు జాగ్రత్త తీసుకోలేదు. ‘‘లింగా’’ ప్రభావం ఒక్క తమిళ సినిమానే కాదు, హిందీ సినిమానీ ప్రభావితం చేయబోతోంది.

సినిమా తీయడం ఎంత గొప్పో, మార్కెట్‌ చేయడం - పెళ్ళాల పుస్తెలు కూడా తాకట్టుపెట్టి డబ్బు తెచ్చి ఆ సినిమా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినవారిని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం!!

హేట్సాఫ్‌ టు మెగా ఫ్యామ్లీ!

-తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ