ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పరిస్థితి నూతిలో చందమామలా కనిపిస్తోంది! పబ్లిక్ మీటింగులకి పట్టుమని వందమంది స్వచ్ఛందంగా రారు. ‘గెలుపు’ అన్న ఆశ కనిపించడంలేదు: తిరుపతి ఉప ఎన్నిక, వైయస్సార్ సీపీ తెలివైన నిర్ణయం తీసుకుంది. బరిలో దిగకుండా హుందాగా ప్రవర్తించింది. దివంగత నాయకుని భార్య అభ్యర్ధి, అధికార పక్షం, అందునా బడుగు వర్గం. కాంగ్రెసు గెలుపుని ఎలా లెక్కించింది? ఎందుకు పోటీ పెట్టింది? కనీసం డిపాజిట్ కూడా దక్కని దుర్భర పరిస్థితిని ఎందుకు కొని తెచ్చుకుంది? ఏమయింది కాంగ్రెసు నాయకత్వానికి? రాష్ట్రాన్ని విభజించి రెండు చోట్లా డీలాపడ్డ కాంగ్రెసుకి అర్జంటుగా బ్రెయిన్ వాష్ చేయగల సమర్ధ నాయకత్వం కావాలి!
-తోటకూర రఘు