Advertisementt

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వేలంటైన్స్‌ డే ‘టెంపర్‌’!

Sun 15th Feb 2015 01:32 PM
jr ntr,temper,valentine day,young tiger ntr fans  ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వేలంటైన్స్‌ డే ‘టెంపర్‌’!
ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వేలంటైన్స్‌ డే ‘టెంపర్‌’!
Advertisement
Ads by CJ

తమ లవ్‌ పార్ట్నర్‌కి ఓ గ్రీటింగ్‌ కార్డ్‌ / ముచ్చటైన ప్రేమ కానుక / తాజా రోజాతో వలపు వాన కురిపించడం రివాజు -‘వేలంటైన్స్‌ డే’ నాడు. ఈ 2015 వేలంటైన్స్‌డే ఎన్టీఆర్‌ అభిమానులకు ప్రత్యేకం. తమ లవ్‌ పార్ట్నర్‌కి సినీమాక్స్‌లో ‘టెంపర్‌’ చూపించి ఆనక ఆమె కోరుకున్న రెస్టారెంట్‌కి తీసుకుపోయింది కొందరయితే, గ్రీటింగ్‌ కార్డ్‌ స్థానంలో ఎన్టీఆర్‌ / కాజల్‌ క్యారికేచర్స్‌కి ముచ్చటగొలిపే కామెంట్స్‌ జోడిరచి మెయిల్స్‌ పంపింది మరికొందరు. మేటరు ఏదయితేనేం వారి వలపు తలపులన్నీ ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ ఫొటో ఆల్బమ్‌ చుట్టూ తిరగడం విశేషం. ‘పోకిరి’ వచ్చినప్పుడు మహేష్‌బాబు అభిమానులు ఎంతగా సెలబ్రేట్‌ చేసుకున్నారో అంతకు రెట్టింపు స్థాయిలో ఎన్టీఆర్‌ అభిమానులు సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఎన్టీఆర్‌ పేరుతో ఈ ‘వేలంటైన్స్‌ డే’ ని ‘టెంపర్‌’ ప్రమోషన్‌కి వాడుకున్న ఎన్టీఆర్‌ అభిమానుల్ని అభినందిద్దాం! వారి ఆలోచనా ధోరణిని అనుసరిద్దాం!!

-తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ