Advertisementt

ప్రత్యర్ధుల మధ్య ప్రేమ సందేశాలే ‘వేలంటైన్స్‌ డే’!

Sun 15th Feb 2015 11:47 AM
valentine,feb 14th,state,india,andhra pradesh,telangana  ప్రత్యర్ధుల మధ్య ప్రేమ సందేశాలే ‘వేలంటైన్స్‌ డే’!
ప్రత్యర్ధుల మధ్య ప్రేమ సందేశాలే ‘వేలంటైన్స్‌ డే’!
Advertisement
Ads by CJ

-వేలంటైన్స్‌ డే!

-ప్రపంచ ప్రేమికుల దినోత్సవం.

-ప్రేమను పంచితే స్పర్ధలు సమసిపోతాయి- వైషమ్యాలు కరిగిపోతాయి అనడానికి ఓ చక్కటి ఉదాహరణలు:

ఆంధ్రా - తెలంగాణ : నిప్పు ` నీరు-అదే విద్యుత్తు - నీటి పంపకాల విషయమై గొడవ పడుతున్నాయి.

భారత్‌ - పాక్‌ : అమీతుమీ తేల్చేసుకునే స్థాయిలో సరిహద్దు వద్ద కాల్పులు- టెర్రరిస్టుల చొరబాట్లు జరుగుతున్నాయి.

-ఈ నేపధ్యంలో సాగర్‌ కుడికాలువకి నీటి విడుదల విషయమై ఆంధ్రా ` తెలంగాణ అధికారులు గొడవపడ్డారు.  పోలీసులు ఒకరిపై మరొకరు లాఠీలు ఝళిపించారు.

14 ఫిబ్రవరి : వేలంటైన్స్‌ డే ` ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం : సమస్యలకు సామరస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకున్నారు. కెసిఆర్‌కి ఫోను చేసి కూర్చుని మాట్లాడుకుందాం ` అన్నారు. అందుకు అంగీకరించిన కెసిఆర్‌ గవర్నరు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. 

-దటీజ్‌ వేలంటైన్స్‌ డే!

భారత్‌ ` పాక్‌ మధ్య మాటల తూటాలేకాదు, సరిహద్దులో రాకెట్లూ పేలుతున్నాయి.

ప్రపంచ క్రికెట్‌ పోటీలు ఆరంభమవుతున్నాయి. చిరకాల ప్రత్యర్ధులు భారత్‌ ` పాక్‌ ‘అడిలైడ్‌’లో ఢీకొనబోతున్నారు. ఈ నేపధ్యంలో మోదీ సార్క్‌ దేశాధినేతలు అందరికీ స్వయంగా ఫోను చేశారు. పాక్‌ ప్రధాని షరీఫ్‌తో ముచ్చట్లాడారు ` భారత ప్రధాని మోదీ.

-దటీజ్‌ ‘వేలంటైన్స్‌ డే’.

-తోటకూర రఘు 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ