మొన్న వి. మధుసూదనరావు, నిన్న కె. రాఘవేంద్రరావు, నేడు వివి వినాయక్
కొత్త హీరోని పరిచయం చేసేటప్పుడు, ఆ కొత్త హీరోనుంచి అద్భుతాలు ఆశించరు ప్రేక్షకులు. ఎలా వున్నాడో చూద్దాం అని వెళ్తారు ప్రేక్షకులు. ‘పర్సనాలిటీ, డాన్సులు, డైలాగ్ డెలివరీ’ ` ముఖ్యం. హీరోలో బ్యాడ్ యాంగిల్స్ కొన్ని వుంటాయి. ఫ్రేమింగ్‌లో వాటిని తప్పించాలి. అన్నిటినీమించి ఆ ఆర్టిస్టులో కాన్ఫిడెన్సులెవల్స్ పెంచాలి. మొన్నటితరంలో దర్శకుడు వి.మధుసూదనరావు, నిన్నటితరంలో కె. రాఘవేంద్రరావు ఈ తరంలో వివి వినాయక్! నాగార్జునని వి.మధుసూదనరావు పరిచయం చేస్తే అఖిల్‌ని వినాయక్ ఫుల్‌ప్లెడ్జ్డ్ హీరోగా పరిచయం చేస్తున్నారు. వినాయక్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ` గుడ్ స్టార్టప్ ఫర్ అఖిల్!! మనకి మరో మాస్ యాక్షన్ హీరో దొరికినట్టే!
-తోటకూర రఘు