వైయస్ హయాంలో కిమ్మనకుండా కూర్చున్న సిపిఎం నేత రాఘవులు.
రాష్ట్ర విభజనని వ్యతిరేకించే వారిపై విరుచుకుపడిన సిపిఐ నేత నారాయణ.
ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీ సభలు విడివిడిగా జరుగుతున్నాయి : ఎజెండా మాత్రం: ఆంధ్రప్రదేశ్ రాజధాని ` భూసేకరణ ` కేంద్రం నుంచి రావలసిన నిధులు!
రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఏచూరి ప్రసంగం ` తెలంగాణ విమోచనోద్యమం ` తెలుగువారు కలిసి వుండాల్సిన అవసరం : కమ్యూనిస్టుల అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
కానీ క్షేత్ర స్థాయిలో బి.వి.రాఘవులు చేయవలసినంత చేయలేదు. సిపిఐ నారాయణ అయితే ‘సమైక్య...’ అంటే ‘నాలుక పీకేస్తా’ అన్న ధోరణిలో విరుచుకుపడ్డారు.
ఈ రోజున తెలంగాణలో కమ్యూనిస్టులకి కేడర్ వుందా?
నాడు నీళ్ళు ,నిధులు, రాజధాని, విద్య ఉద్యోగాలు గురించి మాట్లాడని కమ్యూనిస్టులకు ఈ రోజున చంద్రబాబుని విమర్శించే నైతిక హక్కు వుందా?
ఢల్లీిలో మోదీ మేనియాని కేజ్రీవల్ అడ్డుకున్నాడు. వామపక్షాలు ఆ పని ఎందుకు చేయలేకపోయాయి?
సగటు మనిషి కేజ్రీవాల్‌ని నమ్మినట్లుగా కమ్యూనిస్టులని నమ్ముతున్నాడా?
-తోటకూర రఘు