Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: సాయికార్తీక్‌

Tue 27th Jan 2015 04:13 AM
sai karthik,patas movie,kalyan ram  సినీజోష్‌ ఇంటర్వ్యూ: సాయికార్తీక్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: సాయికార్తీక్‌
Advertisement
Ads by CJ

సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టి చిన్నతనం నుంచి సంగీతం మీద మమకారం పెంచుకొని మణిశర్మ ఏకలవ్య శిష్యుడిగా సంగీతం నేర్చుకొని రిథమ్‌ ప్యాడ్‌ ప్లేయర్‌గా, డ్రమ్మర్‌గా పలువురు ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర వర్క్‌ చేసి ‘కాల్‌సెంటర్‌’తో సంగీత దర్శకుడిగా పరిచయమైన టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయికార్తీక్‌. కృష్ణవంశీ, రామ్‌గోపాల్‌వర్మ వంటి ప్రముఖ దర్శకుల సినిమాలకు కూడా సంగీతం అందించి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సాయికార్తీక్‌ తాజాగా కళ్యాణ్‌రామ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌లో రూపొందిన ‘పటాస్‌’తో మొదటి కమర్షియల్‌ హిట్‌ను అందుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. పాటలు సూపర్‌హిట్‌ అవడమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నారు సాయికార్తీక్‌. ఈ సందర్భంగా సాయికార్తీక్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

‘పటాస్‌’ సూపర్‌హిట్‌ చిత్రంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. దీనిపై మీ రెస్పాన్స్‌?

2015లో నేను మ్యూజిక్‌ చేసిన ‘పటాస్‌’ చిత్రం పెద్ద హిట్‌ కావడం చాలా ఆనందాన్ని కలిగించింది. 2015లో మా ‘పటాస్‌’ బాగా పేలింది. ఆడియన్స్‌ చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకి చాలా మంచి టాక్‌ వస్తోంది. నాకిది కమర్షియల్‌గా పెద్ద హిట్‌ సినిమా. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్‌ అయి బ్లాక్‌బస్టర్‌ మూవీ కావాలని కోరుకుంటున్నాను.

ఈ హిట్‌ కెరీర్‌కి ఎలాంటి టర్నింగ్‌ పాయింట్‌ అయిందనుకుంటున్నారు?

తప్పకుండా ఈ సినిమా నాకు మంచి బ్రేక్‌ ఇచ్చిందని చెప్పాలి. ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చేశాను. కృష్ణవంశీగారితో పైసా, రామ్‌గోపాల్‌వర్మగారితో రౌడీ, నారా రోహిత్‌గారితో ప్రతినిధి చేశాను. ఇవన్నీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నాకు మంచి పేరే వచ్చింది. అయితే సినిమా హిట్‌ అయితేనే అందరికీ మంచి పేరు వస్తుంది. అలా నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సూపర్‌హిట్‌ ఈ సంవత్సరం స్టార్టింగ్‌లోనే వచ్చింది. నేనంటే ఇష్టపడే కొంత మంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నాకు మంచి హిట్‌ రావాలని కోరుకున్నారు. ఈ సినిమా హిట్‌ అవడంతో వాళ్ళంతా నాకంటే చాలా సంతోషంగా వున్నారు. వాళ్ళంతా సినిమా రిలీజ్‌ అయిన రోజే నాకు ఫోన్‌ చేసి అప్రిషియేట్‌ చేశారు. 

ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో చేయడం ఎలా అనిపించింది?

ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ అంటే నా సొంత బేనర్‌ అనే అనుకుంటాను. కళ్యాణ్‌రామ్‌గారి ‘ఓమ్‌ 3డి’ వర్క్‌ చేశాను. కళ్యాణ్‌రామ్‌గారు, హరిగారు నన్ను చాలా బాగా ఎంకరేజ్‌ చేస్తారు. ఎక్కడ ఎలాంటి అవకాశం వున్నా నన్ను చెయ్యమని చెప్తారు. అలాంటి మంచి వ్యక్తులు వున్న ఈ బేనర్‌లో నాకు ఇంత పెద్ద హిట్‌ రావడం చాలా హ్యాపీగా వుంది. 

బాలకృష్ణగారి పాట రీమిక్స్‌ చెయ్యాలన్న ఆలోచన ఎవరిది?

ఈ ఆలోచన మాత్రం హండ్రెడ్‌ పర్సెంట్‌ అనిల్‌గారిదే. తప్పకుండా ఈ పాట వుండాలని ఆయన చేయించారు. నాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే బాలకృష్ణగారి పాట ఇంతవరకు ఎవరూ రీమేక్‌ చెయ్యలేదు. ఆయన పాట రీమిక్స్‌ చేస్తే కమర్షియల్‌గా బాగా వర్కవుట్‌ అవుతుందనేది మంచి ఫీలింగ్‌. మొదట ఈ పాటకి పాత బీజయమ్స్‌ పెట్టి చేశాం. తర్వాత అలా కాదని కొత్త బీజియమ్స్‌ పెట్టి పాత ఫ్లేవర్‌ పోకుండా మాగ్జిమమ్‌ వర్క్‌ చేశాం. ఈ పాటకి థియేటర్‌లో చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవకముందు ఎవరి దగ్గర వర్క్‌ చేశారు?

నేను బేసిక్‌గా రిథమ్‌ ప్యాడ్‌ ప్లేయర్‌ని. మణిశర్మగారికి ఏకలవ్య శిష్యుడ్ని. వందేమాతరం శ్రీనివాస్‌, జి.ఆనంద్‌, వాసూరావు, దేవిశ్రీప్రసాద్‌గారి దగ్గర చాలా రోజులు డ్రమ్మర్‌గా వర్క్‌ చేశాను. ఆ తర్వాత నాకు ఒక సినిమా చేసే అవకాశం రావడంతో మణిగారికి చెప్పాను. అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం ప్రొసీడ్‌ అయిపొమ్మని చెప్పారు. ఇప్పుడు పటాస్‌ హిట్‌ అయిందని తెలిసి నాకు ఫోన్‌ చేసి 2015లో ఫస్ట్‌ హిట్‌ వచ్చింది అని అభినందించారు. 

ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలో మీకు పేరు తెచ్చినవి?

నా ఫస్ట్‌ మూవీ కాల్‌ సెంటర్‌. దాని తర్వాత బ్రహ్మానందం డ్రామా కంపెనీ చేశాను. మెయిన్‌గా చెప్పాలంటే 2014లో ఎక్కువ సినిమాలు చేశాను. పైసా, రౌడీ, ప్రతినిధి చేశాను. ఈ చిత్రాలు నాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చాయి. శంకర కూడా 2014లోనే చేశాను. అది ఈ సంవత్సరం రిలీజ్‌ కాబోతోంది. 

డైరెక్టర్‌ని బట్టి, సినిమాని బట్టి ఔట్‌పుట్‌ మారుతూ వుంటుందా?

మ్యూజిక్‌ అనేది డైరెక్టర్‌ టేస్ట్‌ని బట్టే వస్తుంది. కృష్ణవంశీగారితో పైసా చేశాను. ఆయన టేస్ట్‌ ప్రకారమే మ్యూజిక్‌ చేశాను. రామ్‌గోపాల్‌వర్మగారితో రౌడీ చేసినపుడు ఆయనకి తగ్గట్టుగానే మ్యూజిక్‌ చేశావని అందరూ అన్నారు. అలా డైరెక్టర్‌ని బట్టే ఔట్‌పుట్‌ కూడా వస్తుంది. కమర్షియల్‌ సినిమా విషయానికి వస్తే ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ మ్యూజిక్‌ చెయ్యాల్సి వస్తుంది. 

డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గురించి?

ఆయనకి ఇది ఫస్ట్‌ మూవీ అయినా చాలా కంఫర్టబుల్‌గా వర్క్‌ చేయగలిగాను.  ఈ సినిమాలోని అన్ని పాటలు సింగిల్‌ ట్యూన్‌లోనే ఓకే అయ్యాయి. అనిల్‌గారికి ఎలాంటి మ్యూజిక్‌ కావాలో ఇస్తూనే కమర్షియల్‌గా కూడా వుండేలా జాగ్రత్తలు తీసుకొని చెయ్యడం జరిగింది. ఇందులో మెయిన్‌గా టప్పు టపాం పాట ఎన్టీఆర్‌గారికి బాగా నచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆయనకి బాగా నచ్చింది. 

ఇప్పటివరకు అన్ని సినిమాలకు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. బ్రేక్‌ రాలేదని ఎప్పుడైనా ఫీల్‌ అయ్యారా?

అదొక సీజన్‌లాగే అనుకుంటాను. చిన్నప్పటి నుంచి నేను ఇదే ఫీల్డ్‌లో వున్నాను కాబట్టి అలాంటి ఫీలింగ్‌ ఏమీ కలగలేదు. బేసిక్‌గా మా పేరెంట్స్‌ కూడా ఆర్టిస్టులు. మా నాన్నగారు తబలిస్ట్‌, అమ్మ సింగర్‌ కావడంతో నాకు బ్రేక్‌ రాకపోయినా ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నాను. అది ఈరోజు పటాస్‌ రూపంలో వచ్చినందుకు హ్యాపీగా వుంది.

మీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని అందరూ ఇష్టపడతారెందుకు?

నేను ఏ సినిమా చేసినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి మంచి పేరు వచ్చింది. అది మణిశర్మగారి వల్లే వచ్చిందనుకుంటున్నాను. పటాస్‌కి కూడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు మూడు సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వరకే చేశాను. వాటికి కూడా మంచి పేరు వచ్చింది. 

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

ప్రస్తుతం అసుర, భమ్‌బోలేనాథ్‌ చేస్తున్నాను. పటాస్‌ హిట్‌ అయింది కాబట్టి ఇంకా మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ