Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: మధుర శ్రీధర్‌రెడ్డి

Mon 26th Jan 2015 11:30 AM
  సినీజోష్‌ ఇంటర్వ్యూ: మధుర శ్రీధర్‌రెడ్డి
సినీజోష్‌ ఇంటర్వ్యూ: మధుర శ్రీధర్‌రెడ్డి
Advertisement

మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాతగా, షిరిడీ సాయి కంబైన్స్‌ పతాకంపై ఎం.వి.కె.రెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’. ఈ చిత్రం ద్వారా పి.బి.మంజునాథ్‌ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డితో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ ఎలాంటి సినిమా?

ఎలాంటి సినిమా అనేది చెప్పాలంటే రెండు విషయాలు చెప్పాలి. మొదటిది లేడీస్‌ అండ్‌ జెంటిమెన్‌ కొంచెం ఆలోచించండి. రెండోది లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌ అనేది మనకు బయటికి కనిపించే ఇమేజ్‌. లోపల మరో మనిషి వుంటాడు. లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌కి అదర్‌ కోణం ఇది. అదే ఈ సినిమాలో చూపించబోతున్నాం. 

కథ ఎలా వుంటుంది?

ఇందులో మూడు కథలు వుంటాయి. ఈ మూడు కథలూ యదార్థ సంఘటనలే. మనం సాధారణంగా చూసే సంఘటనలే. ఈ సినిమాకి పూరి జగన్నాథ్‌గారు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఫేస్‌ కూడా కడుక్కోకుండానే ఫేస్‌బుక్‌ను, వాటర్‌ కూడా తాగకుండానే వాట్స్‌ ఆప్‌ను చెక్‌ చేసుకుంటున్నారు. సినిమాలో అది ఫస్ట్‌ లైన్‌. అక్కడి నుంచి సినిమా స్టార్ట్‌ అవుతుంది. 

సినిమా రిలీజ్‌ డిలే అవడానికి రీజన్‌?

డిసెంబర్‌ 6న ఆడియో రిలీజ్‌ అయింది. మేం జనవరి 1న రిలీజ్‌ చేద్దామనుకున్నాం. కానీ, పెద్ద సినిమాలు రాబోతున్నాయన్న చిన్న కన్‌ఫ్యూజన్‌లో చేయలేకపోయాం. రిలీజ్‌ చేసి వుంటే బాగుండేది. ఎందుకంటే రఘువరన్‌ బి.టెక్‌ చిత్రాన్ని ఆడియన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకున్నారు. సినిమాలో విషయం వుంటే తప్పకుండా మంచి సక్సెస్‌ అవుతుందని ఆ సినిమా ప్రూవ్‌ చేసింది. ఏది ఏమైనా జనవరి 30న రిలీజ్‌ చెయ్యాలని ఫిక్స్‌ అయిపోయాం. లక్కీగా ఆ డేట్‌కి సినిమాలేవీ రిలీజ్‌ అవడం లేదు. 

వరల్డ్‌ కప్‌ స్టార్ట్‌ కాబోతోంది. దాని ప్రభావం సినిమా మీద వుంటుందా?

అది మనం చెప్పలేం. మా డిస్ట్రిబ్యూటర్స్‌ చెప్పిన దాన్ని బట్టి మూడు సంవత్సరాల క్రితం వరకు క్రికెట్‌ ఎఫెక్ట్‌ వుండేదట. ఇప్పుడు క్రికెట్‌ చూసేవాడు వేరు, సినిమా చూసే వాడు వేరు. క్రికెట్‌ అనేది పక్కన పెట్టేసెయ్యండి అన్నారు. మా సినిమాలో అంతా కొత్త ఫేసెస్‌ కాబట్టి భారీగా ఓపెనింగ్స్‌ వస్తాయని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యడం లేదు. శని, ఆదివారాలు మంచి కలెక్షన్స్‌ వుంటాయనుకుంటున్నాను. ఆడియన్స్‌కి సినిమా కనెక్ట్‌ అయితే ఆటోమేటిక్‌గా కలెక్షన్స్‌ ఇంప్రూవ్‌ అవుతాయి. 

డైరెక్టర్‌ మంజునాథ్‌ చెప్పిన కథలో మిమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేసిన అంశం ఏమిటి?

సైబర్‌ క్రైమ్స్‌ అనేదే తెలుగులో కొత్త పాయింట్‌. ఇంటర్నెట్‌ మనల్ని పూర్తిగా ఆక్రమించేసింది. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే లాస్ట్‌ ఇయర్‌ మా ఊరికి వెళ్ళాను. అది పల్లెటూరు. అక్కడ ఓ ఇంటర్మీడియట్‌ కుర్రాడు నాతో ఫోటో దిగి 5 నిముషాల్లో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. మా సినిమాలోని బుర్రకథలో చెప్పినట్టుగా దూరం వున్నవాళ్ళు దగ్గరవుతున్నారు, దగ్గరున్నవాళ్ళు దూరమవుతున్నారు. ఒకే ఇంట్లో వుంటున్న భార్యాభర్తలు ఇంటర్నెట్‌ వల్ల దూరంగా బ్రతుకుతున్నారు. ఆ పాయింట్‌ నాకు బాగా నచ్చింది. తెలుగులో ఎక్స్‌పెరిమెంట్‌ చెయ్యొచ్చు అనిపించింది. 

మీరు ఎలాంటి సినిమాలు చెయ్యాలనుకుంటారు?

మూసధోరణిలో కథలు వుండకూడదు అన్న విషయాన్ని నేను మొదటి నుంచీ ఫాలో అవుతున్నాను. స్క్రీన్‌ప్లేలోగానీ, ఎగ్జిక్యూషన్‌లోగానీ ఏదైనా ప్రాబ్లమ్‌ వుంటే వుండవచ్చుగానీ కథల విషయంలో ఎప్పుడూ పొరపాటు చెయ్యలేదు.  ఇప్పటివరకు చేసిన సినిమాల రిజల్ట్‌ చూసిన వారు కమర్షియల్‌ సినిమాలు, కామెడీ, మాస్‌ ఎలిమెంట్స్‌తో వుండే సినిమాలు ట్రై చెయ్యకపోయారా అని అడుగుతుంటారు. హానెస్ట్‌గా చెప్పాలంటే అది నా వల్ల కాదేమో. మూస ధోరణిలో కాకుండా ఒక కొత్త పాయింట్‌ని ఆడియన్స్‌కి చెప్పాలని చేసిన ప్రయత్నమే ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌’ చిత్రం. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ‘మాయ’లో ఇఎస్‌పి అనేది కొత్త పాయింట్‌. ఇక్కడ కమర్షియల్‌గా వర్కవుట్‌ కాకపోయినా బాలీవుడ్‌లో మహేష్‌ భట్‌గారు మర్డర్‌ 4గా మా చిత్రాన్ని రీమేక్‌ చెయ్యడం, మాకు ఆ సినిమాలో 20 పర్సెంట్‌ పార్టనర్‌ షిప్‌ ఇవ్వడమనేది మాలో కాన్ఫిడెన్స్‌ని పెంచింది.

మీరు డైరెక్షన్‌కి దూరంగా వుండడానికి రీజన్‌?

బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ రిజల్ట్‌తో నేను కొంచెం డిప్రెసివ్‌ మోడ్‌లోకి వెళ్ళిన మాట వాస్తవం. ఆ టైమ్‌లో నా స్ట్రెంగ్త్‌ ఏమిటి, నా వీక్‌నెస్‌ ఏమిటి అనేది ఎనలైజ్‌ చేసుకున్నాను. ఒక కొత్త పాయింట్‌తో ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ స్క్రిప్ట్‌ దొరికే వరకు డైరెక్షన్‌ చెయ్యకూడదని అప్పుడు డిసైడ్‌ అయ్యాను. ఎందుకంటే నన్ను సినిమా తియ్యమని తరిమేవారు ఎవరూ లేరు. నేను ఎవరి దగ్గరికీ వెళ్ళి కథ చెప్పను. నా సినిమా నేనే సెట్‌ చేసుకుంటాను. నా సినిమా నేనే ప్రొడ్యూస్‌ చేసుకుంటాను. అలాంటప్పుడు హర్రీలో ఎందుకుండాలి అనుకున్నాను. నేను ఎక్సైట్‌ అయ్యే స్క్రిప్ట్‌ వచ్చే వరకు డైరెక్షన్‌కి దూరంగా వుండాలనుకున్నాను. అలాగే కొత్త పాయింట్స్‌తో వచ్చే కుర్రాళ్ళతో సినిమాలు తియ్యాలనుకున్నాను. అందులో భాగంగా ఫస్ట్‌ మూవీ మాయ, సెకండ్‌ మూవీ లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌, మూడో సినిమా ఓం మంగళం మంగళం. ఇలా నా ప్రాసెస్‌ జరుగుతోంది. ప్రజెంట్‌గా ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌’ మాత్రం జనవరి 30న రిలీజ్‌ చెయ్యబోతున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement