తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయమైన అనూప్ రూబెన్స్‌కి ‘ఇష్క్’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత లవ్‌లీ, గుండెజారి గల్లంతయ్యిందే, మనం, లౌక్యం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూపర్‌హిట్ చిత్రాలకు సూపర్‌హిట్ మ్యూజిక్ అందించి ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరుగా నిలిచారు. ఇప్పటివరకు 37 చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ లేటెస్ట్‌గా వెంకటేష్, పవన్ కళ్యాణ్ హీరోలుగా రూపొందిన ‘గోపాల గోపాల’ చిత్రానికి డిఫరెంట్ మ్యూజిక్ చేసి మరో సూపర్‌హిట్ ఆడియోను అందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ఆడియో పరంగా, రీరికార్డింగ్ పరంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో అనూప్ రూబెన్స్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఇదే సందర్భంలో ‘అనూప్‌రూబెన్స్ డాట్ కామ్’ను సూపర్‌హిట్ ఫిలిం వీక్లీ అధినేత బి.ఎ.రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ.
మీ గత చిత్రాల సంగీతంతో పోలిస్తే ‘గోపాల గోపాల’ మ్యూజిక్ డిఫరెంట్ వుందంటున్నారు?
డెఫినెట్‌గా డిఫరెన్స్ అనేది వుంటుంది. ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసే హీరోలు కావచ్చు, స్టోరీలైన్ కావచ్చు. నిజానికి ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్స్ వుండడం వల్ల మ్యూజిక్ కూడా డిఫరెంట్‌గా చెయ్యాల్సి వచ్చింది. రెగ్యులర్ ఫార్మాట్‌లో వుండే సాంగ్స్ ఈ చిత్రంలో లేవు.
ఆడియో ఫంక్షన్‌లో మీతో సినిమా చేస్తానని పవన్‌కళ్యాణ్ చెప్పడం ఎలా అనిపించింది?
అంత పెద్ద హీరో స్టేజ్ మీద ఆ మాట అనడమే గొప్ప విషయం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా టాలెంట్‌ని ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఆయనది. గుడ్ హార్టెడ్ పర్సన్. ఆయన వున్న రేంజ్‌కి నాకు ఫోన్ చేసి పాటలు బాగున్నాయని అప్రిషియేట్ చెయ్యాల్సిన అవసరం లేదు. అలా చేసారంటేనే ఆయన మంచితనం ఏమిటో తెలుస్తుంది.
ఈ సినిమా ట్యూన్స్ విషయంలో డైరెక్టరే కాకుండా హీరోలు కూడా ఏమైనా సజెషన్స్ ఇచ్చారా?
డైరెక్టర్, నేను కలిసి ఏ ట్యూన్ అయితే బాగుంటుందనేది డిసైడ్ చేశాం. హీరోలు ఎలాంటి సజెషన్స్ ఇవ్వలేదు. ట్యూన్ విన్న తర్వాత బాగుంది, ఇంకాస్త డెవలప్ చేస్తే బాగుంటుందిలాంటి విషయాలు చెప్పారు. అంతకుమించి ఎలాంటి ఇన్‌వాల్వ్‌మెంట్ లేదు.
మీరు చేసిన మూడు పాటల కోసం ఎన్ని ట్రాక్స్ చేశారు?
‘నీదే నీదే’ సాంగ్‌కి మాత్రమే నాలుగు ట్రాక్స్ చేశాను. వాటిలో ఒకటి సెలెక్ట్ చెయ్యడం జరిగింది. ఒక టిపికల్ సిట్యుయేషన్‌లో వచ్చే సాంగ్ కావడం, చిన్న స్పిరిచ్యువాలిటీ వుండడం వల్ల పాట బాగా రావడం కోసం ఎక్కువ ఆప్షన్స్ చెయ్యాల్సి వచ్చింది.
థియేటర్‌లో సినిమా చూశారు కదా! రెస్పాన్స్ ఎలా వుంది?
అద్భుతమైన రెస్పాన్స్ వుంది. ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఒక స్టేడియంలో ఎలాంటి రోర్ వుంటుందో అలాంటి రోర్ థియేటర్‌లో వుంది. నేను చేసిన సినిమాలకుగానీ, బయటి సినిమాలకు గానీ ఫస్ట్ టైమ్ అలాంటి రెస్పాన్స్ చూశాను.
వెంకటేష్‌గారి సినిమా చెయ్యడం ఎలా అనిపించింది?
యాక్చువల్‌గా వెంకటేష్‌గారి సినిమాలకు సురేష్ ప్రొడక్షన్స్‌లో కీబోర్డ్ ప్లేయర్‌గా చేశాను. అప్పుడే ఆయన్ని కలిశాను. ఆ తర్వాత సురేష్‌బాబుగారి అమ్మాయి పెళ్ళికి ఫుల్ ఫ్యామిలీతో దగ్గుబాటి సాంగ్ చేశాను. అప్పుడు మొత్తం ఫ్యామిలీతో పాడిరచాను. అందులో వెంకటేష్‌గారు కూడా పాడారు.
వెంకటేష్, పవన్‌కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చినపుడు ఎలా ఫీల్ అయ్యారు?
హ్యాపీగా అనిపించింది. సేమ్ టైమ్ చాలా రెస్పాన్సిబుల్‌గా కూడా ఫీల్ అయ్యాను. ‘మనం’ తర్వాత నెక్స్‌ట్ డే ఈ సినిమాకి సైన్ చేశాను. సురేష్‌బాబుగారికి ‘మనం’ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చాయి. భీమవరం బుల్లోడు చేస్తున్న టైమ్‌లోనే ‘నేను రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అందులో ఒకటి నువ్వు చెయాల్సి వుంటుంది’ అని ముందే హింట్ ఇచ్చారు. కానీ, అది గోపాల గోపాల అని అప్పుడు నాకు తెలీదు.
రీమేక్ సాంగ్స్, స్ట్రెయిట్ సాంగ్స్.. ఈ రెండిరటిలో మ్యూజిక్ డైరెక్టర్‌కి ఏది ఈజీ?
స్ట్రెయిట్ సినిమా మ్యూజిక్ చెయ్యడమే ఈజీ. ఎందుకంటే ఒరిజినల్‌లో ఒక ఫ్లేవర్ వుంటుంది. దాన్ని ఓవర్‌కమ్ చెయ్యాలా? యాజిటీజ్‌గా చెయ్యాలా అనే క్వశ్చన్ మన ముందు వుంటుంది. స్ట్రెయిట్ సినిమా చేసేటపుడు మనకు ఫ్రీడమ్ అనేది వుంటుంది.
డైరెక్టర్ డాలి గురించి?
అతనితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. మంచి మ్యూజిక్ నాలెడ్జ్ వుంది. డాలీగారు హిందీ బాగా మాట్లాడతారు. నేను కంపోజ్ చేసేటపుడు ఫ్లోలో హిందీ వర్డ్స్ కొన్ని వస్తాయి. దాన్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. అలా డాలీగారితో బాగా సింక్ అయింది.
ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్?
ఎన్టీఆర్‌గారి టెంపర్ చేస్తున్నాను. ఈనెలలోనే ఆడియో రిలీజ్ వుంటుంది. నాగార్జునగారి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్.