ఖడ్గం, ఛత్రపతి, ఖలేజా, గోల్కొండ హైస్కూల్, పిల్లా నువ్వులేని జీవితం వంటి చిత్రాల్లో చేసిన విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న విలక్షణ నటుడు షఫీ. ‘కమిలి’ చిత్రం ద్వారా జాతీయ అవార్డును కూడా అందుకున్న షఫి రొటీన్‌కి భిన్నంగా వుండే క్యారెక్టర్స్‌నే చేయడానికి ఇష్టపడతానంటున్నాడు. దానిలో భాగంగానే తాజాగా రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’ చిత్రంలో కూడా తను ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ చేశాడు. జనవరి 1న విడుదలైన ఈ చిత్రానికి వస్తోన్న విశేష స్పందన నేపథ్యంలో హీరో షఫీతో ‘సినీజోష్’ ఇంటర్వ్యూ.
‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’ అనే ఓ డిఫరెంట్ జోనర్ మూవీ చేశారు. ఆడియన్స్ నుంచి, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లకు భిన్నమైన క్యారెక్టర్‌ని ఈ సినిమాని చేశావని చాలా మంది మెసేజ్‌లు పెట్టారు, ఫోన్లు చేశారు, వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టారు. నేను కూడా ఒక యాక్టర్‌గా ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్‌గా చెప్పాలంటే మిక్స్‌డ్ రెస్పాన్స్ వుంది. కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుందని, కొంతమంది సెకండాఫ్ బాగుందని చెప్తున్నారు. అయితే ఇది రెగ్యులర్‌గా వచ్చే ఫార్ములా సినిమా కాదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కావడంవల్ల స్లోగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. రిలీజ్ రోజు మార్నింగ్ షోకి అంత రెస్పాన్స్ లేదు. సినిమా డిఫరెంట్‌గా వుందని మౌత్ టాక్ స్ప్రెడ్ అవడం వల్ల మ్యాట్నీ నుంచి కలెక్షన్స్ పెరిగాయి.
రామ్‌గోపాల్‌వర్మ సౌండిరగ్‌తో వచ్చిన టైటిల్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది?
యాక్టర్‌గా ఒక భక్తి భావన వుండాలి. గుడికి వెళ్ళినపుడు దేవుడు మనకు ఏం ఇస్తాడు అనేది కాలిక్యులేట్ చెయ్యకూడదు. అలా నేను డైరెక్టర్‌ని నమ్ముతాను. ఇది శామ్‌గోపాల్‌వర్మ, రామ్‌గోపాల్‌వర్మ కాదు అని ఆయన చెప్పారు. అంత క్లియర్‌గా చెప్పాక నేను ఆయనకి సరెండర్ అవ్వాలి. ఎప్పుడైతే సరెండర్ అవుతామో అప్పటి నుంచి మీ కాలిక్యులేషన్స్ కనిపించవు.
నటుడుగా జాతీయ అవార్డు కూడా అందుకున్న మీకు ఈ సినిమా కెరీర్‌పరంగా ఎలాంటి హెల్ప్ అవుతుందనుకుంటున్నారు?
నా కెరీర్‌కి తప్పకుండా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నెగెటివ్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్..ఇలా డిఫరెంట్ జోనర్స్ చేసిన నాకు ఈ క్యారెక్టర్ నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని మాత్రం చెప్పగలను. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ సినిమాని హిందీలో మనోజ్ బాజ్‌పాయ్‌గారు చెయ్యడానికి అంగీకరించారని మా డైరెక్టర్‌గారు చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఈ క్యారెక్టర్‌ని చేయడానికి ముందు ఏమైనా హోమ్ వర్క్ చేశారా?
ఇలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్‌ని పెర్‌ఫార్మ్ చెయ్యాలంటే తప్పనిసరిగా హోమ్ వర్క్ అనేది అవసరం. ఈ క్యారెక్టర్ విషయానికి వస్తే అతను బిహేవియర్ ఎలా వుంటుంది, ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అనే కారణాలు వెతుక్కోవడానికి, లాజిక్స్ అనేది చూడటానికి, అర్థం చేసుకోవడానికి నాలో ఒక థర్డ్ ప్రాసెస్‌ని క్రియేట్ చేసుకున్నాను. దాంతో ఆ క్యారెక్టర్‌ని పర్‌ఫెక్ట్‌గా చెయ్యగలిగాను.
డైరెక్టర్ ఊహకి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్‌ను పెర్‌ఫార్మ్ చెయ్యగలిగాను అనుకుంటున్నారా?
మా డైరెక్టర్‌గారు ఏదైతే అనుకున్నారో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపించానని అనుకుంటున్నాను. ఈ విషయంలో ఆయన శాటిస్‌ఫై అయ్యారని నా నమ్మకం.
హీరోగా కంటిన్యూ అవుతారా?
నాకు అలాంటివి ఏమీ లేవు. ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. మనం ఒకటి కావాలి అనుకుంటే ఆ క్షణం నుంచే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు వున్న పొజిషన్‌ని ప్రేమిస్తాను. మనం ఏదో కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ, దానికి కోసం బాధపడడం, ట్రాజెడీ ఫీల్ అవడం అనేది తప్పు.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్?
కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘షేర్’లో ఒక విభిన్నమైన క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ‘బుల్లెట్ రాణి’ చేస్తున్నాను. ఇవి కాక మరో రెండు సినిమాల్లో పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నాను. అవి పూర్తిగా ఒక షేప్ వచ్చిన తర్వాత ఎనౌన్స్ చేస్తే బాగుంటుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’ హీరో షఫి.