ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> YCP conspiracy to attack sports quota teachers

స్పోర్ట్స్ కోటా టీచర్లపై దాడికి వైసీపీ కుట్ర

YCP conspiracy to attack sports quota teachersYCP conspiracy to attack sports quota teachers

 

ఏపీలో ప్రజలను అయోమయానికి గురి చేసే ప్లాన్ లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయని, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నేడు SAAP కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఎంతోమంతో అర్హులైన అభ్యర్థులు కష్టపడి టీచర్ ఉద్యోగాలు సాదించారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం అది ఒప్పుకోకుండా ధర్నాలు చేస్తుంది.

కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లపై బురద జల్లేందుకు వైసీపీ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. ఇదే విషయం ఉద్యోగాలు పొందిన టీచర్స్ వైసీపీ ఆరోపణలను ఖండిస్తున్నారు. తాము ఎంతో కష్టపడి, క్రీడల్లో పతకాలు సాధించి మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు సాధించామని ఉపాధ్యాయులు స్పష్టం చెయ్యడమే కాదు, తమపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ ఈరోజు వారు కూడా SAAP కార్యాలయం వద్దకు చేరుకొని వైసీపీ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయ లబ్ధి కోసం తమను ఫేక్ టీచర్లు అంటూ బురదజల్లడం, మానసికంగా తీవ్రంగా వేధిస్తోందని వారు కన్నీటి పర్యంతమయ్యారు, మరి నిజంగా దేశం గర్వించేలా క్రీడల్లో రాణించి టీచర్ ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులపై దాడికి వైసీపీ యత్నం శోచనీయం. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువత క్రీడల్లో ప్రతిభను చాటుకుని, రాష్ట్రం–దేశం గర్వించేలా విజయాలు సాధించారు. తమ ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు సాధించారు.

అలాంటి ఉద్యోగ సాధకులపై SAAP కార్యాలయం ముట్టడి పేరుతో దాడికి వైసీపీ కుట్ర చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ శ్రేణులు కావాలనే SAAP కార్యాలయం ముట్టడి పేరుతో విద్వాంశానికి తెర లేపింది అంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

ycp