Advertisementt

కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ ముహూర్తం త్వరలో ఖరారు

Mon 03rd Mar 2025 11:28 PM
mlc  కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ ముహూర్తం త్వరలో ఖరారు
MLC Muhurat for Kommalapati to be finalized soon కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ ముహూర్తం త్వరలో ఖరారు
Advertisement
Ads by CJ

ఎమ్మెల్సీ నగారా మోగిన సందర్భంగా గతంలో కాపు నేత ఉద్యోగుల సంఘ నాయకుడు పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీ ముగియనున్న సందర్భంగా ఆ స్థానంలో టీడీపీ నుండి అదే సామాజిక వర్గానికి అదే జిల్లాకి చెందిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాదా కృష్ణ ను జనసేన నుండి అయితే నాగేంద్ర బాబు పేర్లు దాదాపు ఖరారయినట్లు ప్రచారం జరుగుతోంది 

ఒక వేళ ఇద్దరికీ స్థానాన్ని కల్పించేటట్లయితే పదవీకాలం ముగిసిన బీటీ నాయుడు స్థానాన్ని కూర్పులో ఉన్నట్లు సమాచారం, పదవి కాలం ముగిసిన బీసీ నేత యనమల రామకృష్ణుడు సామాజిక వర్గం నుండి ఇప్పటికే శాసన సభలో మరియు క్యాబినెట్ చోటు దక్కిన తరుణంలో ఆ స్థానాన్ని మరో బీసీ సామాజికవర్గ నాయకుని కట్టబెట్టే అలోచనలో టీడీపీ ఉందనట్లు తెలుస్తోంది గతంలో ఎమ్మెల్సీ పని చేసిన వారికి కాకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది

మరో టీడీపీ నాయకుడు బీసీ సామాజికవర్గానికి చెందిన దువ్వారపు రామారావు పదవి కాలం ముగియటంతో ఆ సామాజికవర్గానికి ఇప్పటికే శాసన సభలో చోటు దక్కటంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో సీట్ల కూర్పులో ఇచ్చిన హామీల్లో మొదటిది బహిరంగ ప్రకటన చేసిన చేసిన తొలి శాసన మండలి స్థానం పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటికి ఇప్పటికే ఖరారు చేసి చంద్రబాబు వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ కొమ్మాలపాటి ఎటువంటి వివాదం లేకుండా తన నియోజవర్గంతో పాటు పల్నాడు జిల్లా 7 స్థానాలు గెలుపుకు జిల్లా పార్టీ పగ్గాలు పట్టి కృషి చేసిన సంగతి విదితమే.

గత మండలిలో క్షత్రియ సామాజికవర్గం నుండి ఉపాద్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ప్రతినిధిగా ఉండే వారు ప్రస్తుత మండలిలో కూడా ఆ సామాజికవర్గానికి దక్కనుందని తెలుస్తోంది చంద్రబాబు ఎన్నికల హామీలో ప్రకటించిన రెండు ఎమ్మెల్సీలలో రెండవది పిఠాపురం టీడీపీ నేత ఎస్ వి ఎస్ వర్మ కు ఖారారు చేసినట్లు సమాచారం. మొత్తానికి చంద్రబాబు హామీ ఇచ్చిన డాక్టర్ కొమ్మాలపాటి, పిఠాపురం వర్మ, కొణిదల నాగబాబుల ఎమ్మెల్సీ నామినేషన్ లాంఛనమే.

MLC Muhurat for Kommalapati to be finalized soon :

Nomination dates for three MLCs to be finalized soon

Tags:   MLC
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ