సినిమా మొదలు పెట్టకముందే లీకులు వదులుతూ తమ సినిమాపై ప్రేక్షకుల అటెన్షన్ క్రియేట్ చేసుకుంటున్న దర్శకులు ఉన్న ఈ రోజుల్లో దర్శకధీరుడు మాత్రం తన కొత్త ప్రాజెక్ట్ కి ఎలాంటి పబ్లిసిటీ వద్దు అనుకుంటున్నారా, లేదంటే మహేష్ తో మొదలు పెట్టిన మూవీ కి అంత సీక్రెట్ ఎందుకు ఓపెనింగ్ చేసారు అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.
అసలు సినిమా ఓపెనింగ్ ఈరోజు అని జస్ట్ నిన్న మాత్రమే బయటికి తెలిసింది. కానీ ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. ఈరోజే జరిగిన రాజమౌళి-మహేష్ ఓపెనింగ్ కి మీడియా అనుమతి లేకపోయినా.. ఆ తర్వాత ప్రెస్ నోట్ వదులుతూ ఓపెనింగ్ పిక్స్ వదులుతారని ఎదురు చూడని ప్రేక్షకుడు లేదు. మహేష్ ఫ్యాన్స్ అయితే మరీనూ.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ మీడియా వరకు రాజమౌళి-మహేష్ కాంబో మూవీ పూజా కార్యక్రమాలు కవర్ చెయ్యాలని కాచుకుని కూర్చుంటే రాజమౌళి మాత్రం సీక్రెట్ గా మహేష్ తో మూవీ ఓపెనింగ్ చేసేసారు. మరి ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఎంతగా డిజప్పాయింట్ అయ్యారో అంతకు మించి మీడియా డిజప్పాయింట్ అయ్యింది.
గత ఏడాదిగా మహేష్-రాజమౌళి కాంబో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూడని రోజు, ఫైనల్లీ ఆ తరుణం వచ్చింది, కానీ రాజమౌళి సీక్రెట్ మైంటైన్ చేసేసరికి అందరిలో నిరాశ కలిగింది. అదే రోజు అలా తన ప్రాజెక్ట్ మొదలు పెట్టిన రాజమౌళి ఇలా రామ్ చరణ్ గేమ్ చెంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తేలారు.