ఎలాగైనా అధికారం చేపట్టాలని బాబు చెయ్యని ప్రయత్నం లేదు. బాబు పేదల పక్షాన ఉంటాను అని నమ్మబలుకుతూనే వారిపై పగపట్టాడు. పేదలకు సంక్షేమ పథకాలను ఇవ్వకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటి మొన్న వృద్దులకు పెన్షన్లు అందకుండా చేసిన బాబు ఇపుడు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పేదలకు చేరకుండా అడ్డుకుంటున్నాడు.
వైసీపీ ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలను ఎలక్షన్ కోడ్ ని అడ్డం పెట్టుకుని పేదలకు చేరకుండా ఈసీకి ఫిర్యాదులు చేసి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు.
సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీ కి ఫిర్యాదు చేశాడు. ఫలితంగా తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ అడ్డుకట్ట వేసింది.
మరోపక్క ఖరీఫ్ కు సన్నద్దమవుతున్న రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోయింది. విద్యార్ధులకు ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు నిలిచిపోయాయి. ఇదంతా బాబే కావాలని చేయిస్తున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పేదల పక్షాన నిలబడడు, సాయం చేసే వాళ్ళని చెయ్యనియ్యడు అంటూ వైసీపీ నేతలు బాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాబును తరిమేసే రోజులు అసన్నమవుతున్నాయి, ఒక్క నెల రోజులు ఓపిక పడితే మళ్ళీ జగనన్న పాలనలో మళ్ళీ పేదలు జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి అంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.