చంద్రబాబుకి కావాల్సిన వాడు, జూనియర్ ఎన్టీఆర్ మామగారు నార్నె శ్రీనివాసరావు చంద్రబాబు పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకప్పుడు చంద్రబాబు హరికృష్ణ కొడుకు ఎన్టీఆర్ కి నార్నె శ్రీనివాస్ కుమార్తె లక్ష్మి ప్రణతితో సబందం మాట్లాడి దగ్గరుండి పెళ్లి చేసిన విషయం అందరికి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే నార్నె శ్రీనివాస్ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి చంద్రబాబు కి షాకిచ్చాడు.
అయితే ఇప్పుడు నార్నె శ్రీనివాసరావు చంద్రబాబు పై చేసిన కామెంట్స్ చూస్తే అందరూ షాకవుతారు. నార్నె శ్రీనివాస్ మీడియాతో మట్లాడుతూ చంద్రబాబు నాయుడు నమ్మతగ్గ వ్యక్తి కాదు, మొదటి నుంచి సొంత తమ్ముడిని మోసం చేసాడు, తమ్ముడికి టికెట్ ఇవ్వలేదు. సొంత తమ్ముడి పరిస్థితి ఈరోజు చాలా దారుణంగా ఉంది. నేను ఈరోజు కాదు నెలరోజులుగా డిమాండ్ చేస్తున్న నీ తమ్ముడిని నలుగురిలో ప్రవేశ పెట్టు అని అడుగుతున్నా..
చంద్రబాబు కోవర్టులని తయారు చేసి పక్క పార్టీలోకి పంపించి వాళ్లతో ఆ పార్టీలో జిమ్మిక్కులు చేయించడం తెలుసు, ప్రజల్లో చంద్రబాబు పై నమ్మక లేదు. కేవలం గారడీలు, మోసాలు చేస్తూ చంద్రబాబు గట్టెక్కుతున్నాడు. సొంత బలంపై చంద్రబాబుకి గెలిచే కెపాసిటీ లేదు.. అంటూ నార్నె శ్రీనివాస్ చంద్రబాబు పై చేసిన కామెంట్స్ చూస్తే చంద్రబాబు ఎలాంటి వాడో అర్ధమవుతుంది.. అంటూ వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.