ప్రస్తుతం ఆంధ్రలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమర శంఖం పూరించాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఎవరికీ వారే కాకుండా వైసీపీ పార్టీ ఒంటరిగా వస్తుంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ లు దోస్తీ కట్టి ఈ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలపై పలు సర్వేలు, ప్రిడిక్షన్స్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది.
పలు సర్వేల్లో ఈసారి ఏపీలో అధికారం వైసీపీ దే అని చెబుతున్నాయి. వైస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. తాజాగా టీడీపీ కి సంబందించిన TDPస్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ వైస్సార్సీపీ గెలుస్తుంది అంటూ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
147 నియోజకవర్గాల్లో 2% ఓట్లతో వైసీపీనే ముందంజలో ఉంది. 28 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా కూడా వైసీపీ 10 లక్షల ఓట్ల ముందంజలో ఉంది... మరి ఈలెక్కన టీడీపీ కూడా ఓడిపోబోతుంది అని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా కనబడుతుంది ఈ సర్వే.