న్యాయంగా పోరాడలేని వాళ్లే హింసను నమ్ముకుంటారు. ధర్మంగా గెలవలేని వాళ్లే తన క్యాడర్ను రెచ్చగొట్టి అవతలివాళ్ళమీద దాడులకు ఉసిగొల్పి రక్తపాతానికి కుట్రలు పన్నుతారు. మూడు శాఖలకు మంత్రిగా చేసినా 2019 ఎన్నికల్లో ఓడిపోయినా లోకేష్ మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఈసారి అక్కడ వైసిపి తరఫున బీసీ అభ్యర్థి లావణ్యను బరిలోకి దించడంతో లోకేష్ లో మళ్ళీ ఓటమి భయం పట్టుకుంది.. అంటూ వైసీపీ శ్రేణులు బలంగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇక ప్రజాస్వామాయబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలిచేది లేదని అర్థం చేసుకున్న లోకేష్ ఏకంగా హింసకు దిగారు.. అంటూ వారు ఆరోపిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణమండపం రోడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకట్ రెడ్డి చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ భయభ్రాంతులను గురిచేసిన తెలుగుదేశం కార్యకర్తలు ఏమిటీ రౌడీయిజం అని ప్రశ్నించినందుకు మేకా వెంకట్ రెడ్డిని బైక్ తో గుద్ది వెళ్ళిపోయిఅతని మరణానికి కారణమైనటుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మేకా వెంకట్ రెడ్డి తలకు బలమైన గాయం తగలడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చికిత్స పొందుతూ మృతి చెందారు.
నిన్న కోమాలోకి వెళ్లిన మేకా వెంకట్ రెడ్డి మరణించడంతో టీడీపీ వాళ్లలో ఓటమి భయం.. ఏమి చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్.. ఎక్కువై ఇలా హింసకు పురిగొల్పుతోంది.. మున్ముందు ఈ టీడీపీ గూండాలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.