ఏపీలో ఎన్నికల కోలాహల పెరిగిపోయింది. వైసీపీ-కూటమి నేతలు ఈసారి ఎలాగైన గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని కష్టపడుతున్నారు. సజావుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడా జరుగుతున్న అల్లర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి ఏపీ మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. జగన్ పై దాడి కేసు లో టీడీపీ కార్యకర్తలు ఇవాల్వ్ అయ్యారంటూ వైకాపా ఆరోపిస్తుంది.
ఇప్పుడు తాజాగా మంగళగిరిలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న నారా లోకేష్ ఈసారి కూడా ఓటమి తప్పదని తెలిసి.. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తన సొంతమనుషులతో దాడులు చేయిస్తున్నాడంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న గురువారం రాత్రి ప్రచారంలో ఉన్న వైసీపీ కార్యకర్త మేకా వెంకటరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చెయ్యగా అందులో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్ళిపోవడంతో ఆయన కుటుంభ సభ్యులు టీడీపీ పై అందులోను నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .
నీ రాజకీయ దాహానికి ఇంకెంత మంది అమాయకుల్ని బలిచేస్తావ్ లోకేష్.. అంటూ బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలోకి వెళ్లిన మేకా వెంకటరెడ్డి ఫ్యామిలీ మెంబెర్స్ తో పటుగా వైసీపీ నేతలు నారా లోకేషుపై విరుచుపడుతున్నారు