2019 లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యంగా వయసు మళ్ళిన వారికి పెన్షన్ ని విడతల వారీగా నెలకి 3000 పంపిణి చేసందుకు గాను, ఆ పెన్షన్ ని అందించడంతో పాటు రకరకాల ప్రజా సేవలు, సెర్టిఫికెట్ లను అందించేందుకు సచివాలయాలు ఏర్పాటు చేసారు. ప్రతి గ్రామానికి గ్రామ వాలంటీర్ లని నియమించింది జగన్ ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రలో బాగా పాపులర్ అయ్యింది. వాలంటీర్ ప్రతి నెల ఒకటో తారీఖున గడపగడపకు వెళ్లి తాతలకి, అవ్వలకి పెన్షన్ అందించేవారు.
అప్పటి నుంచి వాలంటీర్ వ్యవస్థ దిగ్విజయంగా కొనసాగడంతో పలువురు ఇతర రాష్ట్రాల వారు సైతం దాని పై ప్రసంశలు కురిపించారు. అయితే ప్రస్తుత ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లకి ఈసీ వారి పనులకు అడ్డుకట్ట వేశారు. దానితో ఈనెల అనేకమంది వృద్ధులు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈసీ ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థని హోల్డ్ లో పెట్టడంతో జగన్ తమకి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారు అంటూ పలు చోట్ల జగన్ కి వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా జగనన్న కోసం మండపేటలో 800 మంది గ్రామ/వార్డు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసారు. ప్రజలు మేలు కోరే జగనన్న ప్రభుత్వానికి మరొక్కసారి ఓట్ వేసి గెలిపించాలని పలువురు వాలంటీర్లు కోరుతున్నారు