Advertisementt

ఇది చంద్రబాబు రాజకీయం

Sun 14th Apr 2024 01:25 PM
jagan  ఇది చంద్రబాబు రాజకీయం
Chandrababu ఇది చంద్రబాబు రాజకీయం
Advertisement
Ads by CJ

మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి, ప్రజలంతా తమ పక్షానే ఉన్నారని జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం అనే యాత్రతో ప్రజల వద్దకు వెళుతున్న విషయం తెలిసిందే. జగన్ బస్సు యాత్ర చేస్తున్న ప్రతి చోట విపరీతమైన ఆదరణ రావడంతో జీర్ణించుకోలేక కూటమి నాయకులూ ఎలాగైనా దీనిని డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే కావాలని కొంతమంది ఆకతాయిలతో నిన్న శనివారం జగన్ మీద దాడి చేయించారంటూ ఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు. 

దాడి జరిగిన వెంటనే జగన్ కి పెద్ద ఎత్తున పరామర్శలు వస్తున్నాయి. తెలంగాణ మాజీ మంత్రి KTR జగన్ కోలుకోవాలంటూ ట్వీట్ చేసారు.  చాలామంది రాజకీయాలు పక్కనపెట్టి మానవతా కోణంలో ఖండించారు.. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఇది కావాలనే వైసీపీ చేసింది అంటూ దారుణంగా టీడీపీ అఫిషియల్ నుండి సోషల్ మీడియాలో దాడి చెయ్యడం స్టార్ట్ చేసారు. 

ఆఖరికి ప్రధాని మోదీ కూడా జగన్పై దాడి ఘటనపై స్పందించడంతో వెంటనే చంద్రబాబు కూడా జగన్ పై దాడిని ఖండిస్తూ ట్వీట్ వేశాడు.

అయితే పార్టీ నేతలు మాత్రం జగన్ నాటకాలాడుతున్నాడు అంటూ వైసీపీ మీద దాడి చేస్తున్నారు.. చంద్రబాబు ఏమో ఖండిస్తూ ట్వీట్ చెయ్యడం వింతగా ఉంది అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి బుద్ధి చెప్పడం ఖాయమంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.  

Chandrababu:

Jagan

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ