నిన్న శుక్రవారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేరేశ్వరి ఇలా కూటమి నేతలంతా ఒక చోట సమావేశమై ఎన్నికల విషయము, ఇంకా కొన్ని సీట్ల సర్దుబాటు విషయంలో మీటింగ్ పెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల ప్రధానంగా జరిగిన ఈ చర్చ తర్వాత ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ తో చంద్రబాబు దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
అయితే ఆ పిక్ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే టీడీపీ కి సంబందించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే కనిపించడంతో అదంతా ఫేక్ అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.అసలు చంద్రబాబు ఎలాన్ మాస్క్ ని కలవకుండానే కలిసినట్టుగా చంద్రబాబు పక్కన ఎలాన్ మస్క్ ను అతికించిన ఫోటోని కావాలనే టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వదిలారు, బాబు ని ఎలాన్ మాస్క్ కలవడమా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఎలాన్ మస్క్ ఇండియా వస్తున్న అవకాశాన్ని వాడుకోడానికి టీడీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది, దీనికి తోడు Tesla మీద ఫేక్ లెటర్ కూడా ఒక్కటి టీడీపీ వదిలింది.. అంటూ వైసీపీ నేతలు చంద్రబాబు-ఎలాన్ మాస్క్ పిక్ పై కామెంట్ చేస్తుండగా.. ఇది చూసిన వారు అసలు చంద్రబాబు ఎలాన్ మాస్క్ ని కలిసారా అంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.