Advertisement
TDP Ads

PK చెప్పేవి జరుగుతాయా?

Mon 08th Apr 2024 03:10 PM
pk  PK చెప్పేవి జరుగుతాయా?
PK PK చెప్పేవి జరుగుతాయా?
Advertisement

2019 ఎన్నికల సమయంలో జగన్ కి వెన్నంటి ఉంటూ వైయస్సార్ కాంగ్రెస్ కి  వ్యూహకర్తగా పని చేసి జగన్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేవరకు నిద్రపోని ప్రశాంత్ కిషోర్ ఆ ఎన్నికల్లో బిజెపి కి కూడా వ్యహకర్తగా పని చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వ్యూహకర్త ఆలోచనలని పక్కనబెట్టి బీహార్లో రాజకీయ నాయకుడిగా మారాడు. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ మరోసారి వ్యూహకర్త అవతరమెత్తి టీడీపీతో కలిసి కలవనట్టుగా కనిపిస్తూనే అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి చంద్రబాబును కలిసి న తర్వాత ఎలాంటి సర్వే లు, నివేదికలు లేకుండానే తన అభిప్రాయాలూ చెబుతున్నాడు.

అందులో భాగంగానే ఎవరిదగ్గర ఎంత డబ్బు తీసుకున్నారో తెలియదు కానీ..కొత్తగా వైస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైస్ జగన్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది, రానున్న ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ గెలవడం కష్టం అంటూ స్టేట్మెంట్ పాస్ చేయడంపై వైస్సార్సీపీ నేతలు భగ్గుమంటున్నారు.. వాస్తవానికి ఆయనకు ఆంధ్రాలో ఎలాంటి సర్వే వ్యవస్థ లేదు, నెట్ వర్క్ లేదు, ప్రజాభిప్రాయాలు తెలుసుకునే అవకాశం కూడా లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ కొన్ని ఎన్నికల్లో ఇలాంటివే మాట్లాడారు. కానీ ఫలితాలు చూస్తే పూర్తిగా రివర్స్ అయ్యాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ కు తిరుగులేదు BRS హ్యాట్రిక్ కొడుతుందని అన్నారు, కర్ణాటకలో బీజేపీ వస్తుంది అన్నారు, ఈ రెండూ ఢమాల్ అయ్యాయి, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవవొచ్చు ..ఉత్తరాఖండ్ లో బిజెపి గెలుస్తుంది అన్నారు.. ఇక్కడా ఫలితాలు రివర్స్ అయ్యాయి.. 

ఇప్పుడు జగన్ గెలవటం కష్టం, లోక్ సభ  ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ మొదటి స్థానంలో నిలుస్తుంది, దక్షిణాదిలో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుంది అంటూ నిన్న ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గతంలో మీరు చెప్పినవి ఏవి జరగలేదు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం పై మీరు చేస్తున్న వ్యాఖ్యలకు ఫలితముండదు, ఖచ్చితంగా జగన్ ప్రభుత్వమే వస్తుంది అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ మొదటి స్థానంలో నిలుస్తుంది అనేది నిజం కావాలి అంటే బీజేపీ కనీసం ఎనిమిది ఎంపీలు గెలవాలి. కానీ తెలంగాణాలో బీజేపీకి ఆ పరిస్థితి లేదు... ఇప్పుడు వైసీపీ ఆపార్టీ కూడా అంతే.. మీరు సర్వే చెయ్యకుండా ఓడిపోతుంది అని అసత్యాలు ప్రచారం చేసినంత మాత్రాన వైసీపీ ఓడిపోదు, అనుకున్న సీట్ల కన్నా ఎక్కువే గెలిచి చూపిస్తామంటూ వారు ప్రశాంత్ కిషోర్ ని ఛాలెంజ్ చేస్తున్నారు. 

PK:

Prashant Kishor

Tags:   PK
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement