Advertisementt

ఫస్ట్ వచ్చింది.. పెన్షన్ రాలేదు

Mon 01st Apr 2024 01:20 PM
ap  ఫస్ట్ వచ్చింది.. పెన్షన్ రాలేదు
Pension ఫస్ట్ వచ్చింది.. పెన్షన్ రాలేదు
Advertisement

ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెల్లారింది... ఫస్ట్ వచ్చింది కానీ ప్రతి నెల ఒకటో తారీఖున రావాల్సిన పెన్షన్ ఇంటికి రాలేదు. ఎప్పట్లానే గుమ్మం ముందు నవ్వుతూ నిలబడి తాతా .. పెన్షన్ తీసుకో.. అవ్వా వేలిముద్ర వేద్దువురా, వేలి ముద్ర పడకపోతే కన్ను పడుతుందేమో చూద్దాం అని పిలిచే వాలంటీర్ లేడు.. రాలేదు

అవ్వా తాతలకు ఇంటింటికి వెళ్లి సేవలు అందిస్తున్న వాలంటీర్ల కాళ్లకు కోర్టు సంకెళ్లు వేసింది. వాళ్ళు పెన్షన్లు ఇవ్వొద్దని, అది ఎన్నికల కోడ్ కిందకు వస్తుంది అని టీడీపీ నేత చంద్రబబు పిటిషన్ వేయడంతో ఆ పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది.

దీంతో ఈరోజు పేద, వృద్దులకు నిరాశ మిగిలింది. ఎప్పటిలాగే వారికి ఫస్ట్ తేదీన రావాల్సిన పెన్షన్ డబ్బులు చేతిలో పడలేదు. చంద్రబాబు వలన లక్షలాదిమంది అవ్వాతాతల ఆశలు నెరవేరలేదు.

ప్రస్తుతం మండుతున్న ఎండల్లో ఆ అవ్వాతాతలు... వికలాంగులు సైతం సచివాలయం వద్ద కాపు కాయాలి... దీంతోబాటు రేషన్ సరుకులు కూడా ఇళ్లవద్ద ఇవ్వొద్దని కోర్టు చెప్పడంతోతో బియ్యం కోసం ప్రజలు రేషన్ డిపోల వద్ద గుమిగూడుతున్నారు. నిన్నటివరకూ గుమ్మం ముందుకు వచ్చి పెన్షన్లు... బియ్యం.. పప్పులు వచ్చేవని, ఇప్పుడు కొంతమంది చేసిన కుట్రలకు తాము  ఇబ్బందులపాలవుతున్నారని ఎంతోమంది ప్రజలు చంద్రబాబును తిడుతున్నారు.

ఇంకా అధికారంలోకి రాకుండానే చంద్రబాబు ఇలా చేస్తుంటే పాలనలోకి వస్తే రాష్ట్రం మొత్తం ఆవస్థలపాలవుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Pension:

AP

Tags:   AP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement