Advertisementt

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో కీలక నేతలు

Sun 24th Mar 2024 12:46 PM
vizag  విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో కీలక నేతలు
Visakha విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో కీలక నేతలు
Advertisement
Ads by CJ

బ్రెజిల్ నుంచి తెప్పించిన 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో డ్రగ్స్‌ కలిపి విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది మీరు చేసింది అంటే మీరు చేసింది అంటూ టీడీపీ-వైసీపీ వాదులాడుకుంటున్నారు. డ్రగ్స్ తెప్పించడంలో పాత్రధారి సంధ్యా ఆక్వా సంస్థ ఎండీ కూనం కోటయ్య చౌదరి టీడీపీ నేత అవడంతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. చంద్రబాబు, పురంధేశ్వరి, బాలయ్య చిన్నల్లుడు భరత్‌లతో కోటయ్య చౌదరికి వ్యాపార, వ్యక్తిగత బంధాలు ఉంటే.. టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాతోనూ కోటయ్య చౌదరితో ఉన్న వ్యాపార బంధంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

డ్రగ్స్‌ దందాలో కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి ప్రధాన పాత్రధారులు కాగా.. వీరంతా నారా ఫ్యామిలీ బాగా కావాల్సివరు అంటున్నారు. డ్రగ్స్ దందాకు ఆర్థిక, రాజకీయ అండదండలు అందించడం, ఇక్కడికి చేరాక మార్కెటింగ్‌ వ్యూహం అంతా టీడీపీ నేతల కనుసన్నల్లోనే నడుస్తుంది అని వైసీపీ ఆరోపిస్తోంది.

సంధ్యా ఆక్వా కంపెనీ ఏర్పాటులో దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు చెంచురామ్ భాగస్వామి. ఆతర్వాత కంపెనీని మూడుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారం వెనుక డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ లోగుట్టు దాగుందని అంటున్నారు. చంద్ర­­బాబుకు అత్యంత సన్నిహితులు, టీడీపీ ముఖ్య నేతలు, వారి వారసులతో సంధ్యా ఆక్వా కంపెనీ కోటయ్య చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. ఇదంతా టీడీపీ పనే అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

దామచర్ల సత్య (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌ సోదరుడు), రాయపాటి జీవన్‌ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లతో ఓ కోటరీగా గూడుపుఠాణి చేస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ.

చంద్రబాబు సన్నిహితుడిగా పేరున్న ఆల­పాటి రాజాకు సంధ్యా ఆక్వా కంపెనీ కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరీలు కలిసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

Visakha:

TDP

Tags:   VIZAG
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ