పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తుని అధికారికంగా మార్చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. జనసేనలో పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు చేపట్టారు. ఈరోజు జనసేన-టీడీపీ పొత్తు అభ్యర్థుల్ని ప్రకటించారు. టీడీపీ, జనసేన ఇద్దరూ విడివిడిగా కొన్ని సీట్లని ప్రకటించినా.. ఇప్పుడు పొత్తులో భాగంగా తొలి విడత జాబితా వదిలారు. జనసేన పార్టీ 5గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోటీలో నిలిచే 94 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
టీడీపీ తో దోస్తీలో భాగంగా జనసేన పార్టీ మొత్తంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ స్పష్టత ఇచ్చారు. తమ కూటమితో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే అందుకు అనుగుణంగా సీట్లు సర్దుబాటు చేసుకునే విషయంపైనా అవగాహన వచ్చినట్లు పవన్ తెలపడం చూసిన వారంతా చంద్రబాబు-పవన్ లు ఇంకా బీజేపీతో పొత్తు కోసం వెయిట్ చేస్తున్నారంటున్నారు. మూడు పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేసెనేదుకు ముందు నుంచి చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఆసక్తిగా కనబడుతున్నా బీజేపీ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గానే కనబడుతుంది. ఇప్పటికి చంద్రబాబు బీజేపీ పొత్తు కోరుకుంటున్నారు.
అందులో భాగంగానే చంద్రబాబు బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేలా కనిపిస్తోంది. బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం అని కూడా చెప్పారు. ఒకవేళ బీజేపీ పొత్తు కోసం చెయ్యి చాపితే.. అందులో వాళ్లకు ఇవ్వడానికి 57 సీట్లు చంద్రబాబు రిజర్వ్ చేసి ఉంచినట్లుగా వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఒంటరిగా ఎన్నికలకి వెళ్లి గెలవలేని చంద్రబాబు పవన్ జనసేనతో, మోడీ బీజేపీఐతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడంటూ వైసీపీ నేతలు జోక్స్ వేసుకుంటున్నారు.