Advertisementt

సిద్ధం సభలో జగన్ స్పీచ్

Sun 18th Feb 2024 06:50 PM
jagan  సిద్ధం సభలో జగన్ స్పీచ్
CM jagan సిద్ధం సభలో జగన్ స్పీచ్
Advertisement
Ads by CJ

రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభకి విశేష జనప్రవాహం కనిపించింది. అక్కడ సభ ప్రాంగణం మొత్తం జనసముద్రంలా మారింది. ఎన్నికల ముందు సిద్ధం పేరుతొ సీఎం జగన్ అధ్యక్షతన ఈ సభలు నిర్వహిస్తున్నారు. రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో జగన్ ప్రజలను ఉత్తేజపరుస్తూ ఇచ్చిన స్పీచ్ లో హైలైట్స్ ఇలా ఉన్నాయి..

పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది 

2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది 

పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? 

విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది 

పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? 

చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? 

ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? 

చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? 

చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? 

1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? 

మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు 

రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు 

చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే 

అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం

14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా? 

చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి 

గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు 

గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు 

చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు 

చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? 

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా? 

57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం 

57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం 

57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి 

ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించండి 

చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి 

ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం 

ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం 

రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం 

రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం 

మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు 

వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి 

31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది 

ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం 

చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలి 

సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి

ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి 

గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చాం 

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం 

పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం

కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలి

వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి

సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే

YSRCP మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోంది

ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం

ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తాం

లంచాలకు తావులేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతోంది

57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం

ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం

చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే

మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశాం

3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు

అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి?

సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు? అంటూ జగన్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.

CM jagan:

Siddham 

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ