Advertisementt

జర్నలిస్టులపై టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోల్స్

Wed 17th Jan 2024 06:52 PM
tdp  జర్నలిస్టులపై టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోల్స్
TDP జర్నలిస్టులపై టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోల్స్
Advertisement
Ads by CJ

 

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలుగుదేశం, జనసేన పార్టీ.. వాటి అనుకూల సోషల్ మీడియా రెచ్చిపోతోంది. ఈ రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు, అనుకూలమైన వ్యక్తులు ఒక మహిళా జర్నలిస్టును కించపరిచిన విధానానికి అనవరో అవాక్కవుతున్నారు. టీవీ9 మహిళా జర్నలిస్టు హసీనాపై సోషల్ మీడియాలో దారుణమైం ట్రోల్స్ చేస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో టీవీ9 ప్రత్యేక ప్రోగ్రామ్ చేసింది. ఇందులో భాగంగా సీనియర్ కరస్పాండెంట్ హసీనా తన విధి నిర్వహణలో భాగంగా కొడాలి నాని బైక్‌పై కొద్ది దూరం ప్రయాణిస్తుంది. ఆ ఒక్క సందర్భాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో ఆమెపై దుష్ప్రచారం చేశారు. మహిళా జర్నలిస్టు అన్న ఆలోచన లేకుండా హసీనాపై దారుణమైన, అసభ్యకరమై పోస్టులు పెట్టి కొంతమంది పైశాచికానందం పొందారు. 

ఒక రాజకీయ నాయకుడో లేక మరో వ్యక్తితో ప్రోగ్రామ్ చేస్తున్నపుడు విధి నిర్వహణలో భాగంగా ఒక మహిళా జర్నలిస్టు బైక్‌పై ఎక్కితే నీచమైన కామెంట్లు చెయ్యాలా? అయినా ఇలాంటి కార్యక్రమాలు మీడియాలో కొత్తేం కాదు. జర్నలిస్టు అంటే సామాన్యుడి దగ్గర్నించి సెలబ్రిటీ వరకు అందరితో సందర్భాన్ని బట్టి పనిచేస్తూ ఉంటారు. అంతమాత్రాన ఇలా ట్రోలింగ్‌కు దిగుతారా?  ఒక మహిళా జర్నలిస్టు అన్న సంగతి మర్చిపోయి ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా? ప్రోగ్రామ్‌లో భాగంగా అలా చేస్తే దాన్ని కూడా వక్రీకరించి.. ఆమెను మోరల్‌గా దెబ్బతీసేయాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం. జర్నలిజంలో మహిళల సంఖ్య తగ్గుతున్న సమయంలో ఇలాంటి అసభ్యకరమైన, దుష్ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్?

TDP:

Janasena 

Tags:   TDP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ