ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ ఉన్న ప్రధాన పార్టీలన్నీ అలెర్ట్ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం, గెలుపు గుర్రాల కోసం తహతహలాడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారం కోసం కష్టపడుతున్నారు. దానికి సంబంధించి జిల్లా ఇన్చార్జ్ ల మార్పు దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలో కేర్ తీసుకుంటున్నారు. వైస్సార్సీపీ ని మళ్ళి గద్దె నెక్కించేవరకు జగన్ నిద్రపోయేలా కనిపించడం లేదు. ప్రస్తుతం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని 5 రీజియన్ లలో క్యాడర్ మీటింగ్ లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నారు.
ఈ సమావేశాలు 4-6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. జగన్ అధ్యక్షతన వైసీపీ పార్టీలో సభ్యులందరినీ ఏకంచేసి, వారిలో చైతన్యం నింపుతూ రాబోయే ఎన్నికల్లో 175 /175 సీట్లలో గెలిచేలా వారిని సంసిద్ధం చేయడమే ఈ సమావేశాల యొక్క ముఖ్యమైన లక్ష్యం. అందులో భాగంగా మొదటి సమావేశం జనవరి 25 వ తేదీన విశాఖపట్నం, భీమిలిలో జరగనుంది. ఈ సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి సక్సెస్ చెయ్యాలని వైసీపీ కార్యకర్తలు గట్టి అపట్టుదలతో కనిపిస్తున్నారు.
ఇక మిగిలిన 4 ప్రాంతాల సమావేశాల తేదీలను, వేదికలని త్వరలో తెలియజేయడం జరుగుతుంది అని వైసీపీ నేతలు తెలిపారు. ఈ మీటింగ్ కు 3లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.