కొత్త సంవత్సరంలోనూ బీసీలపై దాడి మొదలుపెట్టిన టీడీపీ, జనసేన
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు.
కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో పాటు అద్దాలు పగలగొట్టి, ఫ్లెక్సీలు చించి వేసి రౌడిల్లా ప్రవర్తించారు.
ఆఖరుకి నూతన సంవత్సరం నాడు కూడా వీరి అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. ఒక మహిళా నాయకురాలి ఆస్తులు ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు
కొత్త సంవత్సరంలో బీసీలపై దాడులు మొదలుపెట్టిన చీడీపీ జనసేన నాయకులు. ఏకంగా ఒక బీసీ మహిళా మంత్రి పైనే దాడులకి దిగి బీసీలని రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారు. బీసీలపై ఇంత కక్ష పెంచుకున్న ఈ టీడీపీ జనసేన పార్టీలను వచ్చే ఎన్నికల్లో బీసీలు రాజకీయ సమాధి కడతారు.