Advertisementt

జగన్ పాలన ప్రతిబింబించే చిత్రం

Wed 20th Dec 2023 10:56 AM
ys jagan  జగన్ పాలన ప్రతిబింబించే చిత్రం
CM Jagan జగన్ పాలన ప్రతిబింబించే చిత్రం
Advertisement
Ads by CJ

వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో చెబుతుంది అంటారు.

సీఎం వైయస్ జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తూ.. వారిని తన సొంతవారిలా అక్కున చేర్చుకుంటున్నారు అన్న థీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ఓవైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం,  వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను చేర్చారు. సీఎం వైయస్  పాలనలో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే.. ఇది చూసి ఓర్వలేని బ్యాచ్ గోతికాడ నక్కల్లా చూస్తున్నట్టున్న ఈ చిత్రం వైయస్ఆర్‌సీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటోంది.   

చిత్రానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. అందుకే ఆ చిత్రం చెప్పే భావాలు జనం మెదల్లలో అలా నిలిచిపోతాయి. 

రాష్ట్రంలో సమకాలిన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఫ్లెక్సీలు ప్రజల మనసును కట్టిపారేశాయి. ఆలోచనాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రజల మనసుకు చేరువ చేసింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ జనం తమ ఫోన్ లలో స్క్రీన్ లలో, వాట్సప్ స్టేటస్ లలో సోషల్ మీడియా హ్యాండిల్స్ సేవ్ చేసుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడు జగనన్న పాలనకు ప్రతిరూపంగా వారు భావిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు పెట్టిన గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అభిమాన నాయకుడి పేరున ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను ప్రతి ఒక్కరూ అసక్తిగా చూస్తున్నారు. ఆరాధన భావంతో తిలకిస్తున్నారు. 

అలాంటి అపురూపమైన చిత్రాన్ని డిసెంబర్ 21న సీఎం వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంతా ఫొటోను తమ వాట్సాప్, సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకోవడంతోపాటు షేర్లు చేసుకుంటూ మరింత విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది.ఈనెల 21న సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు నాటికి ఈ జోష్ మరింత పెరిగే అవకాశం ఉంది.

CM Jagan :

YS Jagan birthday special

Tags:   YS JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ