టీడీపీ లో టికెట్ కోసం తెలుగు తమ్ముళ్లు కుమ్ములాట మాత్రమే కాదు తిరగబడుతున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నవారికి టికెట్స్ ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా లేరనే వార్తలు జీర్ణించుకోలేని వారు చంద్రబాబుపై తిట్ల దండకం అందుకుంటున్నారు. నిన్నటివరకు దేవుడు అని భజన చేసి ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు తమకి సీటు ఇవ్వడం లేదు అంటూ రోడ్డెక్కుతున్నారు.
అందులో భాగంగానే మావోయిస్టుల చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సోము తనయుడు అబ్రహాం, ఆయన అభిమానులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. అబ్రహాంకు ఆఖరి వరకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు.. అంటూ అరకు పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సమావేశాన్ని అడ్డుకుని టిడిపి నేతలు నిరసన తెలిపారు. టిడిపి నేత అబ్రహాంకు అన్యాయం చేశారంటూ చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అరకు పర్యటనకి వచ్చిన నక్కా ఆనంద్ బాబు కి సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి నిరసన సెగ ఎదురవడంతో పార్టీలో ఈ కుమ్ములాట ఎక్కడికి దారితీస్తుందో అని అధిష్టానం గాబరపడిపోతున్నట్లుగా వార్తలోస్తున్నాయి.