తెలుగుదేశం నాయకులకు మహిళలపట్ల ఎంతటి చులకన భావన ఉంటుందో అనేది టీడీపీ ని వీడిన మహిళలను అడిగితే తెలుస్తుంది.. సినీనటి కవిత, దివ్యవాణి, వాణివిశ్వనాథ్, యామిని శర్మ .. వీళ్లంతా పార్టీలో వారు వీళ్లకి ఇచ్చే విలువ గౌరవం అన్నీ గమనించి పార్టీని వదిలి వెళ్లిపోయారు.. ఇప్పుడు తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే తన వద్దకు సాయం కోసం వచ్చిన మహిళలను లోబరుచుకుని ఇబ్బంది పెట్టింది బయటకు వచ్చింది.
రాయలసీమ టీడీపీ ఎమ్మెల్యే ఓ మహిళతో అసభ్యంగా చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. గతంలో ఎమ్మెల్యేగా ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. పంచాయితీకి వచ్చిన మహిళలకు లోబరుచుకోవడం ఈ నేతకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు బయటపడింది ఒక్క ఫోన్ చాటింగ్ మాత్రమేనని.. ఇలాంటివి బయటకు రానివి ఆయనలో అనేకం ఉన్నాయని అంటున్నారు.
అప్పట్లో కుటుంబ తగాదాలతో పంచాయితీ కి వచ్చిన వాళ్ళని డబ్బు ఆశ చూపి లోబరుచుకోవడం అయన టాలెంట్.
ఇప్పుడు తమ పార్టీకి అధికారం పోయినా ... తానూ ఓడిపోయినా అతను మారలేదు. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన మహిళలను అవసరానికి వాడుకోవడంలో ఈయన సిద్ధహస్తుడు. కుదిరితే నమ్మించడం.. ఒప్పించడం.. కుదరకపోతే బెదిరించడం.. ఏదైనాకానీ చివరకు వాళ్ళను దారికి తెచ్చుకోవడం అయన అంతిమ లక్ష్యం.. మొత్తనికి మూడు మెసేజిలు.. ఆరు వీడియో కాల్స్ అన్నట్లుగా అయన పురాణం సాగుతోంది.