Advertisementt

ఫేక్ న్యూస్ : టీడీపీకి వ్యూహకర్తగా పీకే

Sat 16th Dec 2023 04:27 PM
pk  ఫేక్ న్యూస్ : టీడీపీకి వ్యూహకర్తగా పీకే
TDP ఫేక్ న్యూస్ : టీడీపీకి వ్యూహకర్తగా పీకే
Advertisement
Ads by CJ

ప్రశాంత్ కిషోర్.. రాజకీయాలపై అవగాహన ఉన్న వారు ఈ పేరు తెలియనివారు ఉండరు. ఐప్యాక్ పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి రాజకీయ వ్యూహకర్తగా అనేక పార్టీలకు సేవలు అందించారు. ప్రధాని మోడీతో సహా కేజ్రీవాల్, మమతాబెనర్జీ, స్టాలిన్ సహా ఏపీలో వైయస్ జగన్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. 

=ఐప్యాక్ నుంచి పూర్తిగా వైదొలిగిన పీకే- జనసురాజ్ పేరుతో బీహార్‌లో రాజకీయ వేదిక

అయితే గత ఏడాదికాలంగా ఆయన ఐప్యాక్ మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగి.. తన సొంత రాష్ట్రం బీహార్‌లో జనసురాజ్ పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. కొంతమంది టీమ్‌తో కలిసి రాజకీయాలపై ఆసక్తి గలిగిన యువతతో కలిసి ఆ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు. బీహార్‌ రాజకీయ యవనికపై తనదైన ముద్రను లిఖించాలన్నదే ప్రశాంత్ కిషోర్ అంతిమ లక్ష్యం. 

బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ బిజీబిజీ

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై ఉన్నారు. తాను నెలకొల్పిన సంస్థ ఐప్యాక్ నుంచి వైదొలిగారు. అయితే ఏపీ రాజకీయాలపై మరోసారి పీకే దృష్టి పెట్ట‌బోతున్నార‌న్న‌ది కేవలం ఒక వర్గం చేసుకుంటున్న ప్రచారం మాత్రమే. ప్రస్తుతం ఆయన లక్ష్యం బీహార్ పాలిటిక్స్. అక్కడ తనదైన మార్క్ రాజకీయాలు చేసేపనిలో ఉన్నారు. 

ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో తలదూర్చే ఆలోచన పీకేకు లేదన్నది అతని సహచరుల మాట. కాబట్టి గతంలో తాను పనిచేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశమే లేదు. జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ఏ కారణం లేక కొంతమంది కావాలనే పీకే పేరును తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. 

వచ్చే ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ సారథ్యంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ దశలో టీడీపీకి అనేక జిల్లాల్లో పోటీలో నిలిపేందుకు అభ్యర్థులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అసలు ఏ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలియని వారితో ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారనుకోవడం ఒట్టి భ్రమే.

TDP:

PK

Tags:   PK
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ