ఏపీలో ఉద్యోగ జాతర మొదలైంది. ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలవ్వడం ఏపీ చరిత్రలోనే సువర్ణాధ్యాయం. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీచేయనుంది జగనన్న ప్రభుత్వం. 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీ పోస్టులో భర్తీ కానున్నాయి.
897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్..
ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు - 331
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - 566
జగన్ ప్రభుత్వంలో హాయంలో 6 లక్షల 16 వేల 323 పోస్టులను నియమించింది. ఇన్ని ఉద్యోగాలు గతలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన బాబు సర్కార్ వారిని నమ్మక ద్రొహం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు సాకుతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకేుండా మోసం చేసింది. జగన్ హయాంలో నిబందనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేసింది ప్రభుత్వం. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో గతంలో ఏ ప్రభత్వమూ చేయని విధంగా రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించిన ఘనత జగనన్న ప్రభుత్వందే.
జగన్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా పేద,మద్య తరగతి కుటుంబాలకు ఆర్ధిక పరిపుష్ఠి కలిగింది. చదువుకున్న ప్రతి విద్యార్ధి మంచి ఉద్యోగం జగనన్న థ్యేయం. విద్యావ్యవస్థ బాగుంటేనే సమాజం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది సీఎం జగన్ గారి నమ్మకం. అందుకే గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయలనన్ని నిధులు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్ళాలని, అన్ని బడుల్లో నాడు నేడు లో భాగంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు జగనన్న. విద్యకు అగ్రతాంబూలం ఇచ్చి ప్రతి పేదవిద్యార్ధ కూడా ఉన్నత విద్య చదువుకోవాలని అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్యబోధన చేసిన గొప్ప కార్యక్రమం గత ప్రభుత్వాలు గాని, దేశంలో ఏ రాష్ట్రంలో కాని జరగలేదు. జగన్ సర్కార్ చేసిన విద్యా సంస్కరణల సత్ఫలితాలు ఇపుడు ప్రతి పేద, మద్య తరగతి కుటుంబాల వారు చూస్తున్నారు.
ప్రజారోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50 నెలల్లో 53 వేల 126 పోస్టులను భర్తీ చేసింది. ఆరు లక్షల ఉద్యోగాల్లో లక్షా 84 వేల 264 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేశారు.3 లక్షల 99 వేల 791 పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం జరిగింది. 19 వేల 701 పోస్టులు కాంటాక్ట్ బెసెస్ లో నియామకాలు జరిగాయి. ఇవి కాక మరో 10 వేల 143 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. యూనివర్శిటీల్లో 3500 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది.
టిడిపి హాయాంలో వైద్య ఆరోగ్య శాఖలో 1693 పోస్టులు మాత్రమే భర్తీ చేయగా సీఎం జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్ లు మొదలకుని టీచింగ్ ఆస్పత్రులు ఖాళీ పోస్ట్ అనేది లేకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 53 వేల 126 పోస్టుల్నీ భర్తీ చేసిన ఘనత జగనన్నకే దక్కుతుంది. వీరిలో 3899 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు, 2088 మెడికల్ ాఫీతసర్లు, 13540 ఎఎన్ఎమ్ లు గ్రేడ్ 3 పోస్టులతో కలిపి 19527 పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమాకాలు జరిగాయి. 2. వీటితో పాటు 10032 మంది ఎంఎల్ హెచ్పీలు, 6734 స్టాఫ్ నర్స్ లు, 9751 మంది పారా మెడికల్ సిబ్బంది, 3303 క్లాస్-4 సిబ్బంది, 249 మంది డీఈవోలతో పాటు మెడికల్ కాలేజీల్లో నియమించిన 1582 ఉద్యోగులు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 53,126 పోస్టులున్నాయి.ఇది కదా ఉద్యోగా విప్లవం అంటే, టిడిపి హాయాంలో కేవలం వేలల్లో పోస్టులు భర్తీ చేసి చేతులు దులుపుకున్న మాటల ప్రభుత్వం అది. ఇచ్చిన హమీకి తగ్గకుండా జగనన్న హయాంలో ఆరున్నర లక్షల ఉద్యోగాల నియామకాలు చేసి రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలికారు జగనన్న.
నాలుగన్నర ఏళ్ళ జగన్ పారదర్శక పాలనలో 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించి ఏపీ చరిత్రలోనే నూతన ఒరవడికి నాంది పలికారు.