అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ దొరికిపోయిన జగన్ రెడ్డి ముఖ్య అనుచరుడు సత్తారు వెంకటేష్ రెడ్డి. ఇతని బ్యాక్ గ్రౌండ్ చూసి, వైకాపా స్టేట్ కో-ఆర్డినేటర్ లాంటి పెద్ద పదవి ఇచ్చాడంటే, జగన్ రెడ్డి ఎలాంటి వాడో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే 20 ఏళ్ల కుర్రాడికి బంగారు భవిష్యత్తు ఆశ చూపించి అమెరికా రప్పించి, అక్కడ కూడా తమ అధినేత జగన్ రెడ్డి నేర్పించిన పాలెగాళ్ళ సంస్కృతి చూపించాడు ఈ సత్తారు వెంకటేష్ రెడ్డి. ఆ కుర్రాడిని తన ఇంట్లో బంధించి, కొట్టి, హింసించి పైశాచిక ఆనందం పొందాడు. పాపం పండి దొరికిపోయాడు. ఈ వైకాపా నేత నిర్వాకంతో, అమెరికాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది.. అంటూ తెలుగు దేశం పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో వైసిపి పై బురద జల్లుతుంది.. అంటూ వైసీపీ ఆరోపిస్తుంది.
అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఆర్‌ఐ సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కేసులో ఉన్న సత్తారు వెంకటేష్ రెడ్డి చేసిన నేరం అతని వ్యక్తిగతం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. అంటూ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వైయస్‌ఆర్‌సీపీ టీడీపీ ఆరోపణలను ఖండిస్తోంది.
అంతేకాకుండా గురువింద గింజ సామెతలో ఇపుడు పచ్చపార్టీ నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. తప్పు ఎవరు చేసిన తప్పే.. అమెరికాలో వుమెన్ ట్రాఫికింగ్ ఘటనలో టిడిపి పెద్ద రాద్దాంతం చేస్తోంది.
గతంలో అమెరికాలో టిడిపి తరుపున ఉన్న వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడింది. ఉమెన్ ట్రాఫికింగ్ ఆరితేరిన ఘనులు తెలుగు తమ్ముళ్ళే అన్న సంగతి మర్చిపోయారా సామి. అప్పట్లో వారిపై ఆరోపణలు వచ్చినపుడు టిడిపి నేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు గానికనీసం ఖండించలేదు వారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం పార్టీ నుండి కూడా తొలగించలేకపోయింది టిడిపి.. అంటూ వైయస్‌ఆర్‌సీపీ టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఆధారాలతో సహా తిప్పికొడుతోంది.