Advertisementt

ఏపీ విద్యా సంస్కరణలు భేష్

Sun 05th Nov 2023 08:17 PM
ap education  ఏపీ విద్యా సంస్కరణలు భేష్
AP Education Reforms Besh ఏపీ విద్యా సంస్కరణలు భేష్
Advertisement
Ads by CJ

ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్ సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సం స్కరణలకు అంతర్జాతీయ వేదికమీద ప్రశంసల జల్లు కురిసింది. నెదర్లాండ్స్ లోని యుట్రెచ్ట్ జరుగుతున్న గ్లోబల్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్ఫరెన్స్-2023లో భారత ప్రతినిధిగా  ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సదస్సులో జరిగిన ప్యానెల్ చర్చలో ఈజిప్ట్, బుర్కినాఫాసో, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్తో పాటు భారత్ తరఫున పాల్గొన్న సురేష్ కుమార్ మాట్లాదురూ విద్యాభివృద్ధికి మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఆవిష్కరణలు, సాధించిన ఫలితాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ఎలా విజయం సాధించగలిగింది అని ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. బదులిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతమైన ఎస్సీఈఆర్టీ, జిల్లా విద్యా శాఖాధికా రులు, డీఎస్వోలతో పాటు భాగస్వామ్య సంస్థలైన అటౌన్ ఇంటర్నేష నల్, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, రీప్ బెనిఫిట్ సహకారంతో సాధ్యమైందని చెప్పారు. అనంతరం అయన యునిసెఫ్, ది గ్లోబల్ ఫైనాన్షి యల్ లిట్రసీ ఎక్సలెన్స్ సెంటర్ చర్చల్లో పాల్గొన్నారు.

ఐరాస సదస్సులో మనబడి పిల్లలు 

రాష్ట్రంలో విద్య వ్యవస్థలో మొదలైన సంస్కరణలు, అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు, ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్లో 

అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే  అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని ఆయాదేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనావిధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలమీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాలమీద చర్చలు.. విద్యావేత్తలు, ఆర్థిక, సామజిక వేత్తలతో భేటీలు నిర్వహించారు. పదిమంది విద్యార్థులు పదిహేను రోజులపాటు 

కొలంబియా , స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు  న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన  కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలమీద అవగాహన పెంపొందించుకున్నారు.

ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు గురించి వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి నాడు- నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందీ పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు. అంతేకాకుండా మన ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు.

AP Education Reforms Besh:

AP Education Reforms Get Appreciation at BESH Netherlands International Conference

Tags:   AP EDUCATION
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ