Advertisementt

ఏపీలో పరిశ్రమలకు పట్టాభిషేకం

Fri 03rd Nov 2023 04:06 PM
ap  ఏపీలో పరిశ్రమలకు పట్టాభిషేకం
Thousands of job opportunities in AP ఏపీలో పరిశ్రమలకు పట్టాభిషేకం
Advertisement
Ads by CJ

రాష్ట్రంలో పారిశ్రామిక వికాసానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 

పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పెట్టుబడిదారులకు పలు అవకాశాలు కల్పిస్తోంది. వారు కోరినమేరకు భూములు ఇవ్వడంతోబాటు పలు రాయితీలు.. మౌలిక సౌకర్యాలు కల్పిస్తోంది. అందుకే దేశంలోనే పరిశ్రమల స్థాపనకు, వ్యాపారాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన ఎంపికగా మారింది. విశాఖ పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు సైతం పాల్గొనగా రూ. 13 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. కడప స్టీల్ ప్లాంట్, విశాఖలో టైర్ల పరిశ్రమలు, సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాల్లో భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో పలు పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో రూ. 19 వేల కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమల స్థాపనకు ఆమోదం తెలిపారు.  

పలు పరిశ్రమలకు మార్గం సుగమం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద రిలయన్స్ పవర్ ఆధ్వర్యంలో రూ. 6174 కోట్ల పెట్టుబడితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రాబోతోంది. దీనికోసం సంస్థ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా దాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదించింది. దీనివల్ల 600 మందికి  ప్రత్యక్షంగా మరో రెండువేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దీంతోబాటు ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. దీంతోబాటు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం దగ్గరున్న పారిశ్రామికవాడలో స్మైల్ కంపెనీ రూ. 166 కోట్లతో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల దాదాపు 5000 వేలమందికి ఉపాధి దొరుకుతుంది. ఇదే సెజ్ లో ఉన్న ఏటీసీ టైర్స్ సంస్థ రూ. 679 కోట్లతో సంస్థను విస్తరించనుండగా దీనిలో కొత్తగా 300 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఏలూరులోని కొమ్మూరువద్ద రూ. 114 కోట్లతో ఏర్పాటు కానున్న వెంకటేశ్వర బయోటెక్ సంస్థ 310 మందికి ఉపాధికల్పించే పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. తిరుపతిలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ సంస్థ రూ. 933 కోట్లతో సంస్థను విస్తరిస్తుండగా దీనివల్ల 2100 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. రాజమండ్రి సమీపంలోని కడియం వద్ద ఉన్న ఆంధ్రపేపర్ మిల్లు విస్తరణకు ఆ సంస్థ ముందుకు వచ్చింది దీనికోసం రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెడుతుండగా దీనివల్ల రూ. 3000 మందికి ఉద్యోగాలు వస్తాయి.  

విజయనగరంలోని ఎస్. కోట వద్ద రూ. 531 కోట్లతో ఏర్పాటు చేస్తున్న JSW ఇండస్ట్రియల్ పార్కులో ప్రత్యక్షంగా 35,750 మందికి , పరోక్షంగా 9375 మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ జిల్లా పద్మనాభం వద్ద రూ. 50 కోట్లతో  ఓరిల్ ఫుడ్స్ సంస్థ ఏర్పాటు కానుండగా దీనిలో 550 మందికి ఉద్యోగాలు వస్తాయి.

Thousands of job opportunities in AP:

Economic activity in AP to be boosted

Tags:   AP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ