జైలు ఎదుట బాబు స్పీచ్
Babu speech in front of the jailచంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో ఈరోజు అనారోగ్య కారణాలతో రాజమండ్రి జైలు నుంచి నాలుగు వారాల మధ్యంతర బెయిలుపై మంగళవారం నాలుగు గంటలకి బయటికొచ్చారు. అయితే చంద్రబాబు ఎలాంటి పొలిటికల్ కార్యక్రమాల్లోనూ, అలాగే పార్టీ కి సంబందించిన కార్యకలాపాల్లో పాల్గొనగూడదు అంటూ కొన్ని కండిషన్స్ పై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మీ ఆరోగ్యపరిస్థితిని గమనించి, మీకు కంటి చికిత్స అవసరాన్ని గుర్తించి నెలరోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నాం. ఈ నెలరోజులు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీడియాతో మాట్లాడొద్దు.. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దు.. నెల కాగానే మళ్ళీ మీరు లొంగిపోవాలి అంటూ పలు షరతులు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు ఈరోజే ఉల్లంఘించారు.. అంటూ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.
వ్యవస్థలను నడిపేదే నేను అనుకుంటున్నారో ఏమో కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాగానే చంద్రబాబు వెంటనే స్పీచ్ మొదలు పెట్టారు.. నేను నిప్పును.. తప్పు చేయను.. చేయనివ్వను అంటూ తన ఘనతను చెప్పుకుంటూ పోవడమే కాదు.. జైలు దగ్గర నుంచి కార్యకర్తలు సైతం ర్యాలీ చేసారు.. అంటూ కోర్టు ఉత్తర్వులని బాబు ఉల్లగించారంటూ వైసీపీ నేతలు చంద్రబాబు పై ఫైర్ అవుతున్నారు.
చంద్రబాబు తానూ జైల్లో ఉన్నపుడు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ లోని కొందరు నేతలు ధన్యవాదాలు తెలిపారు. నెలరోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు విధించిన నిబంధనలు అయన ఒక్కరోజులోనే ఉల్లంఘించి తన తీరును వెల్లడించారు. ఇప్పుడే ఇలా ఉంటె ఈ నెలరోజుల్లో ఇంకెన్ని విధాలుగా తన దూకుడును బయటపెట్టి కోర్టులను, వాటి తీర్పులను అవహేళన చేస్తారో అంటూ వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu political speech in front of the jail






































