Advertisementt

బాబుకి షరతులతో కూడిన బెయిల్

Tue 31st Oct 2023 11:38 AM
chandrababu  బాబుకి షరతులతో కూడిన బెయిల్
Conditional bail for Babu బాబుకి షరతులతో కూడిన బెయిల్
Advertisement
Ads by CJ

స్కిల్ స్కాములో దాదాపు రూ. 374  కోట్లను దోచుకుని, పైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ లిక్కర్ స్కాం లో కీలక సూతారధారి గా ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తిరిగి  నవంబర్ 28 న సరెండర్ అవ్వాలని కోర్టు ఆదేశించింది.

-అరెస్ట్ అయిన నెలన్నర రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆనాటి నుంచీ అనారోగ్యం పేరిట టీడీపీ శ్రేణులు, అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. చర్మ సమస్యలు ఉన్నాయని, కంటి సమస్య ఉందని, బీపీ, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నాయని బెయిల్ కోసం ఇలా పలు అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ వస్తోంది. 

-చంద్రబాబు విషయంలో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకోవడమే కాకుండా ఎన్నడూ లేనిది ఆయనకు ఎయిర్ కండిషనర్ కూడా ఏర్పాటు చేసింది. అయినా సరే బెయిల్ కోసం ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని వారి ప్రయత్నాలు ఆపలేదు. 

ఇన్నేళ్ళుగా వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు చట్టానికి చిక్కి, జైల్లో అర్థశతదినోత్సవం చేసుకున్నారు. అనారోగ్యకారణలతో షరతులతో కూడిన బెయిల్ ఇప్పుడు దక్కింది

అనారోగ్య రీత్యా బెయిల్ మంజూరు

-ఈ నేపథ్యంలో ఆయనకు  షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్ట్ ఇస్తూ... విధించిన షరతులు... 👇🏻

1. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు...

2. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు...

3. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది...

4. చంద్రబాబు తో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి.

5. Z+ సెక్యూరిటీ విషయంలో... కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, CBN సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య.

Conditional bail for Babu:

Conditional bail for ChandraBabu

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ