టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన ఏ క్షణమైనా బయటకు వస్తారని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అన్యాయమంటూ టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణి వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే నారా భువనేశ్వరి పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీ కంచాలు మోగించడం, ప్లకార్డుల ప్రదర్శన వంటి కార్యక్రమాలు జరిగాయి. ఇక టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు నారా భువనేశ్వరి రంగంలోకి దిగనున్నారని టాక్.
నారా భువనేశ్వరి బస్సుయాత్ర చేపడతారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిరాహార దీక్ష చేపట్టిన భువనేశ్వరి.. అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర చేపడుతారట. ప్రస్తుతం చంద్రబాబు క్వాష్ పటిషన్, బెయిల్ మంజూరు కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. రేపు ఈ రెండు కేసులు విచారణకు రానున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టేసినా.. లేదంటే బెయిల్ మంజూరు చేసినా భువనేశ్వరి సైలెంట్ అవుతారట. లేదంటే 5వ తేదీ నుంచి భువనేశ్వరి రంగంలోకి దిగుతారట. ఇప్పటికే దీనికి రూట్ మ్యాప్ కూడా సిద్దమైనట్లు సమాచారం. ఎక్కడి నుంచి నిర్వహించాలనే దానిపై కూడా ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసినట్టు సమాచారం.
ముందుగా తమ సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి భువనేశ్వరి బస్సు యాత్రను ప్రారంభిస్తారని సమాచారం. ఈ యాత్ర రాయలసీమ జిల్లాల మీదుగా సాగుతుందని పలువురు నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఇది అంతా చంద్రబాబు కోర్టు కేసులపై ఆధారపడి ఉంటుందని టాక్. ఒకవేళ కేసులు వాయిదా పడి తిరిగి చంద్రబాబును రిమాండుకు తరలిస్తే మాత్రం పక్కాగా భువనేశ్వరి బస్సు యాత్ర ఉంటుందట. ఈ క్రమంలోనే ఆమె 4వ తేదీనే కుప్పానికి బయలు దేరుతారట. 5 నుంచి యాత్రను ప్రారంభిస్తారట. మొత్తానికి రానున్న ఎన్నికల్లో టీడీపీ తరుఫున నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి కీలకం కానున్నారని తెలుస్తోంది.